MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కాఫీ తాగే అలవాటుందా..? ఆరోగ్యంగా ఉండాలనుకుంటే రోజుకు ఇన్ని కప్పుకు మించి తాగకండి..

కాఫీ తాగే అలవాటుందా..? ఆరోగ్యంగా ఉండాలనుకుంటే రోజుకు ఇన్ని కప్పుకు మించి తాగకండి..

కాఫీ తాగడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగని కప్పులకు కప్పులు లాగించేస్తే మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. నిపుణులు సిఫార్సు చేసిన ప్రకారం.. కాఫీని తాగితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Oct 03 2022, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టీ కంటే కాఫీనే టేస్టీగా ఉంటుంది. అందుకే కొంతమంది ఏకంగా ఉదయం లేవగానే బ్రష్ కూడా చేయకుండా బెడ్ కాఫీ అంటూ తాగేస్తుంటారు. ఇంకొంతమంది ఫ్రెష్ అయ్యి తాగితే.. కొందరు ఏదైనా తిన్నాక కాఫీని తాగుతుంటారు. ఏదేమైనా కాఫీని ఎప్పుడు పడితే అప్పుడు తాగే వారు చాలా మందే ఉన్నారు. నిజానికి కాఫీ ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీన్ని కొన్ని కొన్ని సమయాల్లో అస్సలు తాగకూడదు. అలాగే మోతాదుకు మించి కాఫీని తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కూడా.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. ఎన్నో గుండె సంబంధిత సమస్యలను కూడా పోగొడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఎన్నో అధ్యనాలు నిరూపించాయి. నిజానికి కాఫీలో పొటాషియం, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. 

37

కాఫీలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి గుండె జబ్బులను, ఇతర వ్యాధులను నివారించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ కాఫీ గుండె జబ్బులను పోగొడుతుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును కూడా తప్పిస్తుంది. ఈ ప్రయోజనాలను పొందాలంటే కాఫీని పరిమితిలోనే తాగాలని నిపుణులు సలహానిస్తున్నారు. కాఫీ లేదా కెఫిన్ కంటెంట్ ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. శరీరానికి శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

47

కాఫీ మనసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. నిరాశకు గురైనప్పుడు ఒక కప్పు కాఫీని తాగండి. ఇది మీకు మూడ్ లిఫ్టర్ గా పనిచేస్తుంది. కాఫీలో పాలీఫెనాల్ ఉంటుంది. ఇది శరీర మంటను తగ్గిస్తుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి కాఫీ బెస్ట ఆప్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే కాఫీ కేలరీలను బర్న్ చేస్తుంది. ఈ కాఫీ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

57

రోజుకు ఎన్ని కప్పుల కాఫీని తాగాలి? 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 2 నుంచి 3 కప్పుల కాఫీని తాగాలి. ఇంతకు మంచి తాగితే శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడతాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

67

కప్పు కాఫీ ద్వారా ఒక వ్యక్తి 100 మిల్లీగ్రాముల కెఫిన్ ను పొందుతాడు.  ఒకవేళ మీరు 5 నుంచి 7 కప్పుల కాఫీని తాగితే మీ శరీరంలోకి 700 మిల్లీ గ్రాముల కెఫిన్ వెళుతున్నట్టు. ఇది పరిమితికి మించి తీసుకున్నట్టు. ఇంకొంతమంది అయితే ఏకంగా రోజుకు 2000 మిల్లీ గ్రాముల కెఫిన్ ను కూడా తీసుకుంటుంటారు. ఇది మీ ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. ఇది గుండె సంబంధింత రోగాలకు దారితీస్తుంది. అలాగే ఆంగ్జైటీకి దారితీస్తుంది. ఇక ఆడవారిలో అయితే పునరుత్పత్తి ఆరోగ్యం దెబ్బతింటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

77

కాఫీని ఎలా తీసుకోవాలి

కాఫీలో పాలను కలపకపోవడమే బెటర్. బ్లాక్ కాఫీలో పాలను మిక్స్ చేయడం వల్ల దానిలో కేలరీలు పెరుగుతాయి. దీనివల్ల బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ కాఫీని తాగడమే ఉత్తమం. ఇక చక్కెరలో కూడా కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి కాఫీలో చక్కెరను ఎక్కువగా వేయకండి. ఇదే మీ ఆరోగ్యానికి మంచిది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 30 వేల‌తో మొద‌లై నెల‌కు రూ. 30 ల‌క్ష‌లు.. అవినాష్ స‌క్సెస్ స్టోరీ, ఇలా చేస్తే మీకు కూడా సాధ్య‌మే
Recommended image2
Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు
Recommended image3
Gas Burner: గ్యాస్ త్వరగా అయిపోతోందా? అయితే బర్నర్‌ను వెంటనే ఇలా క్లీన్ చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved