ఇలా స్నానం చేస్తే గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
రోజూ కాకపోయినా.. రెండు రోజులకోసారైనా తప్పకుండా స్నానం చేయాలంటారు ఆరోగ్య నిపుణులు. స్నానం ఎన్నో వ్యాదులను దూరం చేయడంతో పాటుగా గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో స్నానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు అంటారు. కానీ రోజుకు రెండు పూటలా స్నానం చేసేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఫుల్ బిజీ బిజీ లైఫ్ ను లీడ్ చేసే జనాలకు తినే టైమే ఉండటం లేదు ఇక.. రెండు పూటలా స్నానం చేయడానికి ఏం టైం ఉంటుంది. పనులకు వెళ్లే కొంతమంది ఉదయం పూట స్నానం చేస్తే.. మరికొంతమంది మాత్రం సాయంత్రం వేళల్లో స్నానం చేస్తుంటారు.
పని వల్ల అలసిపోయినప్పుడు స్నానం చేయడం వల్ల రీఫ్రెష్ గా తయారవుతారు. వేడి నీరు లేదా చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని కొన్ని సార్లు వేడి నీటి షవర్ శరీరాన్ని రీఫ్రెష్ గా మారుస్తుంది. అయితే నిద్రకు ముందు వేడినీటితో లేదా చల్ల నీటితో స్నానం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెండింటి ప్రయోజనాలు, నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేడి స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
పడుకునే ముందు కనీసం ఒక గంట పాటు స్నానం చేయడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటి స్నానం వల్ల రాత్రిపూట మీరు ఎలాంటి డిస్టెబెన్స్ లేకుండా నిద్రపోతారు. ఎందుకంటే వేడి నీటి షవర్ మీకు విశ్రాంతినిస్తుంది. మీ ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. శరీరం రిలాక్స్ అయితే చాలా త్వరగా నిద్రపోతారు. మనస్సుపై ఒత్తిడి ఎక్కువ పడినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. అయితే పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేస్తే మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది నిద్రలో సంభవించే పక్షవాతం లేదా కార్డియాక్ అరెస్ట్ ను నిరోధిస్తుంది.
వేడినీటి స్నానం వల్ల కలిగే ఇబ్బందులు
వేడినీటి స్నానం వల్ల మీ చర్మం పొడిబారుతుంది. దీంతో చర్మంపై దురద పెడుతుంది. అందుకే వేడినీటితో 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే స్నానం చేయాలి. ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మంలోని తేమ పోతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా చల్లని నీటితోనే స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
చల్ల నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
చల్లని నీటి స్నానం మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచడానికి సహాయపడుతుంది. చల్ల నీటితో స్నానం చేసేటప్పుడు శరీరంలో నోర్పైన్ఫ్రైన్, కార్టిసాల్ విడుదల అవుతాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే రక్తంలో కార్టిసాల్ పరిమాణం మీరు ఎక్కువసేపు మెలకువగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత కండరాలకు ఉపశమనం కలిగించడానికి చల్లని నీటి స్నానం మంచిది. సాధారణంగా వ్యాయామం చేసిన తరువాత కండరాలు నొప్పిగా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో చన్నీటి స్నానం నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఐస్ బాత్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
చన్నీటి స్నానం ప్రతికూలతలు
చన్నీటి స్నానం తర్వాత మీ శరీరం చాలా చల్లగా మారిపోతుంది. బాడీ అంత తొందరగా వేడిగా మారదు. ముఖ్యంగా చేతులు, పాదాలు చల్లగా అయిపోతాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చల్ల నీటితో స్నానం చేయడం వల్ల జలుబుతో పాటుగా జ్వరం కూడా వస్తుంది. కొన్నిసార్లు చల్ల నీటితో స్నానం చేయడం వల్ల చేతులు, కాళ్లలో తిమ్మరి వస్తుంది.