MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dry Cleaning: డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా..ఇంట్లోనే పట్టుచీరల క్లీనింగ్ ఇలా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి

Dry Cleaning: డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా..ఇంట్లోనే పట్టుచీరల క్లీనింగ్ ఇలా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి

Dry Cleaning: ఖరీదైన పట్టుచీరలు అనగానే గుర్తొచ్చేది డ్రై క్లీనింగ్. ప్రతిసారీ షాపుకు వెళ్లడం బోలెడు ఖర్చు. ఇంట్లో ఉతికితే పాడవుతాయని భయపడుతున్నారా? చిన్నపాటి చిట్కాలు పాటిస్తే, మీ పట్టుచీర కొత్తదానిలా మెరిపించవచ్చు. ఈజీ పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : May 07 2026, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డ్రై క్లీనింగ్ ఖర్చులకు భయపడుతున్నారా?
Image Credit : Gemini

డ్రై క్లీనింగ్ ఖర్చులకు భయపడుతున్నారా?

ఖరీదైన పట్టుచీరలు అనగానే ముందుగా గుర్తొచ్చేది డ్రై క్లీనింగ్ ఖర్చులే. కానీ, ఇంట్లోనే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే పైసా ఖర్చు లేకుండా వీటిని ఏళ్ల తరబడి కొత్తవాటిలా మెరిపించవచ్చు. పట్టుచీరలను ఎప్పుడూ ప్లాస్టిక్ కవర్లలో కాకుండా, గాలి ఆడేలా పలచని కాటన్ వస్త్రంలో లేదా మస్లిన్ క్లాత్ బ్యాగుల్లో చుట్టి భద్రపరచాలి. అలాగే, నెలల తరబడి ఒకే మడతలో ఉంచితే ఆ చోట పోగులు బలహీనపడి చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి ప్రతి మూడు నెలలకోసారి మడతలు మారుస్తూ ఉండాలి. బీరువాలో పురుగులు చేరకుండా నెఫ్తలీన్ గోళీలకు బదులుగా ఎండిన వేప ఆకులు లేదా లవంగాలను చిన్న గుడ్డలో కట్టి ఉంచడం వల్ల రంగు పాడవకుండా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా, చీర కట్టుకున్న తర్వాత వచ్చే చెమట తేమ పూర్తిగా పోయే వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టి, ఆ తర్వాతే మడతపెట్టి దాచుకుంటే పట్టు మెరుపు తగ్గకుండా ఉంటుంది. ఇలాంటి సహజమైన పద్ధతులు పాటిస్తే మీ ఇష్టమైన పట్టుచీరలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.

25
సారీ క్లీనింగ్
Image Credit : Gemini

సారీ క్లీనింగ్

ఒకటి రెండు సార్లు కట్టుకున్న తర్వాత వెంటనే ఉతకాల్సిన అవసరం లేనప్పటికీ, కానీ అలాగే బీరువాలో పెట్టేస్తే చెమటకు పాడయ్యే అవకాశం ఉంది. భోజనం చేసేటప్పుడు మరకలు పడితే, ఆ ఒక్క చోట మాత్రమే శుభ్రం చేసుకునే 'స్పాట్ క్లీనింగ్' పద్ధతులు వాడవచ్చు. లేదంటే ఇంట్లోనే మైల్డ్ షాంపూతో అతి తక్కువ సమయంలో శుభ్రం చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతిసారీ డ్రై క్లీనింగ్‌కు ఇచ్చే భారీ ఖర్చు తప్పుతుంది. అయితే, మరకలు మొండిగా ఉన్నప్పుడు లేదా జరీ పాడవుతుందనే భయం ఉన్నప్పుడు మాత్రం రిస్క్ తీసుకోకుండా ప్రొఫెషనల్ డ్రై క్లీనింగ్‌కు ఇవ్వడమే మంచిది. జాగ్రత్తలు తీసుకుంటే మీ పట్టుచీరలు మీ పర్సుపై భారం పడకుండానే మెరుస్తూ ఉంటాయి. 

Related Articles

Related image1
Silk Sarees: ఈ కలర్ సారీలో మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది!
Related image2
Old Sarees: పాత చీరలేం వేస్ట్ కావు.. వీటిని ఇలా ఉపయోగిస్తే సరి
35
చీరపై మచ్చలు
Image Credit : Gemini

చీరపై మచ్చలు

మీ పట్టుచీరపై ఏవైనా మరకలు పడితే నిమ్మరసం వాడండి. మరక ఉన్నచోట కొన్ని నిమ్మరసం చుక్కలు వేసి చేత్తో సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ఉతకాలి. ఇంకో విషయం గమనించండి…కొన్ని చీరల రంగులు నిమ్మరసం వల్ల పోవచ్చు. కాబట్టి ముందుగా చీర అంచు మీద ప్రయత్నించి చూసుకోండి).

45
డిటర్జెంట్
Image Credit : Gemini

డిటర్జెంట్

మైసూర్ సిల్క్, బెనారసీ, కంచిపట్టు వంటి చీరలను ఉతకడానికి సాధారణ డిటర్జెంట్లు వాడకూడదు. బేబీ షాంపూ లేదా ఇలాంటి చీరల కోసమే మార్కెట్లో దొరికే ప్రత్యేకమైన డిటర్జెంట్లు వాడాలి. వీటితో మరకలు సులభంగా పోతాయి.
55
ఎక్కువగా రుద్దకండి
Image Credit : Gemini

ఎక్కువగా రుద్దకండి

ఈ చీరలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఉతికేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. అలా చేస్తే చీర మెత్తదనం పోవడమే కాకుండా, రంగు కూడా వెలిసిపోతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో చిన్న పిల్లల్లా కనిపించొచ్చు..!
Recommended image2
Relationship Tips: గృహశాంతి కోసం అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిందేంటో తెలుసా? ఈ సూత్రాలే మీ ఇంటికి శ్రీరామరక్ష
Recommended image3
ChintaChiguru: చింతచిగురు కోడిగుడ్డు.. ఇలా చేసి తింటే.. మటన్ కూడా పనికి రాదు..!
Related Stories
Recommended image1
Silk Sarees: ఈ కలర్ సారీలో మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది!
Recommended image2
Old Sarees: పాత చీరలేం వేస్ట్ కావు.. వీటిని ఇలా ఉపయోగిస్తే సరి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved