family peace ఇంట్లో గొడవలకి ఉప్పుతో చెక్.. అదెలాగంటే..!
ఇంట్లో ప్రశాంతత కోసం: కొన్ని ఇళ్లలో రోజూ చిటపటలే. ఆలుమగల మధ్య నిత్యం గొడవలే. ఇలాంటి పరిస్థతి మీ ఇంట్లోనూ ఉంటే కొన్ని వాస్తుల చిట్కాలతో ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు అంటున్నారు వాస్తు నిపుణులు. అదెలాగో తెలుసుకోండి..

గొడవలు తగ్గాలంటే..
హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాల ప్రకారం, ఇంట్లో వస్తువులను సరైన దిశలో ఉంచితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మీరు వాస్తు నియమాలను పాటించకపోతే, ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో, మీ ఇంట్లో కూడా తరచుగా గొడవలు, అభిప్రాయ భేదాలు ఉంటే, దానికి వాస్తు లోపం కారణం. కాబట్టి ఇంట్లో ఉండే వాస్తు దోషాలను పోగొట్టి, ఇంట్లో ప్రశాంతత నెలకొనడానికి వాస్తు చిట్కాలను మాత్రం పాటిస్తే చాలు. అవి మీకు తప్పకుండా సహాయపడతాయి. అవేంటంటే..
బుద్ధ విగ్రహం
మీ ఇంట్లో తరచుగా గొడవలు, అభిప్రాయ భేదాలు ఉంటే, తప్పకుండా ఒక బుద్ధ విగ్రహాన్ని కొని పెట్టుకోండి. బుద్ధ విగ్రహం శాంతి, సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. బుద్ధుడు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. అంతేకాకుండా బుద్ధుడు ఉన్న స్థలం శుభప్రదంగా ఉంటుందని చెబుతుంటారు.
పగిలిన అద్దం
మీ ఇంట్లో పగిలిన అద్దం ఉంటే వెంటనే దాన్ని బయట పడేయండి. ఎందుకంటే పగిలిన అద్దం ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఇంట్లో చాలా అద్దాలు ఉంటే, అది ఇంటిని అందంగా చూపించడమే కాకుండా, ఇంటికి సానుకూల శక్తిని కూడా తెస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి ఉంటే గొడవలు రావు. వాస్తు శాస్త్రం ప్రకారం, అద్దాన్ని మీరు ఎప్పుడూ ఉత్తరం దిశలో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోండి.
కల్లు ఉప్పు:
వాస్తు శాస్త్రం ప్రకారం, ఉప్పు అన్ని రకాల ప్రతికూల శక్తిని తొలగించడానికి సహాయపడుతుంది అని చెబుతారు. కాబట్టి మీ ఇంట్లో గొడవలు తరచుగా జరుగుతుంటే, గది మూలలో ఒక గుప్పెడు కల్లు ఉప్పును ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నిలుస్తుంది. ముఖ్యంగా కల్లు ఉప్పును ప్రతి నెల మార్చాలి. ఇది కుటుంబంలో గొడవలను తగ్గించి, సంతోషాన్ని, శాంతిని ఇస్తుంది.
కర్పూరం
ఇంట్లో జరిగే గొడవలు తగ్గడానికి కర్పూరం సహాయపడుతుంది. దీని కోసం రాత్రి పడుకునే ముందు కర్పూరాన్ని పిత్తర దీపంలో పెట్టి వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గి, ప్రశాంతత నెలకొంటుంది. వారంలో ఏదో ఒక రోజు కర్పూరాన్ని వెలిగించి దాని పొగను ఇల్లంతా వ్యాపింప చేయండి. దీనివల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది.