Back Pain: ఏం చేసినా నడుం నొప్పి తగ్గడం లేదా? అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి..
Back Pain: లేవకుండా గంటల తరబడి పనిచేయడం, బరువులను ఎత్తడం, కూర్చునే, పడుకునే పద్దతి సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల నడుం నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పిని కొన్ని సింపుల్ టిప్స్ తో తగ్గించుకోవచ్చు.

ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా నడుం నొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికోసం ఎన్నో మెడిసిన్స్ ను కూడా తీసుకునే వారున్నారు. అయినా సమస్య అంత తొందరగా తగ్గదు. కానీ మెడిసిన్స్ ను ఎక్కువగా వేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయినా ఈ సమస్యను కొన్ని సహజ పద్దతుల్లో కూడా తగ్గించుకోవచ్చు.
గంటల తరబడి కూర్చోవడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, మంచంపై కూర్చొని ఆఫీస్ పనులను చేయడం, విపరీతంగా బరువులను ఎత్తడం వంటి వల్ల నడుం పై ఒత్తిడి ఎక్కువగా పడి నడుం నొప్పి వస్తుంది. అంతేకాదు వ్యాయామం చేయకపోవడం, శరీరంలో కాల్షియం తక్కువ అవడం వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుంది. ఈ నొప్పిని కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని రకాల కుర్చీలు కూడా వెన్ను నొప్పికి కారణమవుతాయి. మీరు వర్క్ ఫ్రం హోం చేసేవారైతే.. కంప్యూటర్ ముందు కూర్చోవడానికి కూర్చీలు సపరేట్ గా ఉంటాయి. వాటినే వాడండి. చెక్క కుర్చీలను కూడా వాడొచ్చు. మీ టేబుల్ కు, కుర్చీకి మధ్య ఎత్తు సరిపోయేలా చూసుకోండి.
పని కారణంగా గంటల తరబడి కూర్చుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనివల్ల నడుం నొప్పి వస్తుంది. అందుకే పని మధ్య మధ్యలో లేచి నడవండి. అప్పుడే మీరు శరారీరకంగా చురుగ్గా ఉంటారు. నొప్పి కూడా ఉండదు.
గోరు వెచ్చని నీళ్లు కూడా నడుం నొప్పిని తగ్గిస్తాయి. ఇందుకోసం గోరు వెచ్చని నీళ్లను కాసేపు నడుం పై పెడితే కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాని ఊరికూరికే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను మాత్రం వేసుకోకండి.
నడుం నొప్పిని అల్లం కూడా తగ్గిస్తుంది. అల్లంలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది నడుం నొప్పిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం మీరు ప్రతిరోజు కొద్దిగా అల్లం తిన్నా.. లేదా అల్లం టీ తాగినా.. నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
రెగ్యులర్ గా పసుపు పాలు తాగినా నడుం నొప్పి మటుమాయం అవుతుంది. ఇందుకోసం గ్లాస్ పాలను తీసుకుని అందులో కొద్దిగా పసుపును కలపి తాగండి. రెగ్యులర్ ఈ పసుపు పాలను తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాదు.. నడుం నొప్పి కూడా తగ్గుతుంది. ఈ పాలను తాగితే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
నిమ్మకాయ కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు గ్లాస్ గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరం కలపి ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తాగాలి. నిమ్మలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా శరీరానికి పోషణను కూడా అందిస్తుంది. నడుం నొప్పి కూడా తగ్గుతుంది. నిమ్మరసం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.