MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • కిరాయి ఇంట్లో నష్టం జరిగితే ఖర్చు ఎవరు భరించాలి? యజమానా.. అద్దెదారుడా? చట్టం ఏమి చెబుతోంది?

కిరాయి ఇంట్లో నష్టం జరిగితే ఖర్చు ఎవరు భరించాలి? యజమానా.. అద్దెదారుడా? చట్టం ఏమి చెబుతోంది?

Home Rent: ఇంట్లో న‌ల్లాలు పాడవడం, విద్యుత్ సమస్యలు రావడం, గోడలు పగలడం, పైపులు లీక్ అవడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో మరమ్మతుల ఖర్చు అద్దెకు ఉన్న వారు భ‌రించాలా.? య‌జ‌మానా అన్న సందేహం రావ‌డం కామ‌న్‌. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 19 2026, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అద్దె ఇళ్లకు సంబంధించిన చట్టం ఏమి చెబుతోంది?
Image Credit : Gemini AI

అద్దె ఇళ్లకు సంబంధించిన చట్టం ఏమి చెబుతోంది?

మోడల్ టెనెన్సీ యాక్ట్-2021 ప్రకారం ఇంటిని నివాసానికి అనుకూలంగా ఉంచే బాధ్యత యజమాని, అద్దెదారుడు ఇద్దరికీ ఉంటుంది. అయితే సాధారణ వినియోగం వల్ల ఇంటికి కలిగే చిన్నపాటి అరిగిపోవడం లేదా సహజంగా జరిగే మార్పులను నష్టం కింద పరిగణించరు. అందువల్ల అలాంటి విషయాలపై యజమాని, అద్దెదారుడు మధ్య వివాదం అవసరం లేదని చట్టం సూచిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెద్ద మరమ్మతుల బాధ్యత ఇంటి యజమానిదే
Image Credit : Gemini AI

పెద్ద మరమ్మతుల బాధ్యత ఇంటి యజమానిదే

ఇంటికి సంబంధించిన ప్రధాన నిర్మాణ మరమ్మతులు పూర్తిగా ఇంటి యజమాని బాధ్యతగా చట్టం పేర్కొంటోంది. ఇంటికి పూర్తిగా పెయింటింగ్ చేయించడం, గోడల్లో పెద్ద పగుళ్లను సరిచేయడం, ప్రధాన తలుపులు, కిటికీల మరమ్మతులు, నీటి ప్రధాన పైప్‌లైన్ సమస్యలు, డ్రైనేజ్ లేదా మురుగు వ్యవస్థలో లోపాలు వంటి పనులన్నింటికీ అయ్యే ఖర్చును యజమానే భరించాలి.

35
చిన్నపాటి నిర్వహణ పనులు ఎవరు చేయాలి?
Image Credit : Gemini AI

చిన్నపాటి నిర్వహణ పనులు ఎవరు చేయాలి?

రోజువారీ వినియోగంతో ఏర్పడే చిన్న సమస్యలను సాధారణంగా అద్దెదారుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు బల్బులు మార్చడం, చిన్నపాటి ప్లంబింగ్ సమస్యలు, స్విచ్‌లు లేదా ఫ్యూజ్‌ల మరమ్మతులు, ఇంటి పరిశుభ్రత నిర్వహణ వంటి పనులు సాధారణ నిర్వహణ కిందకు వస్తాయి. వీటికి సంబంధించిన ఖర్చును అద్దెదారుడే భరించాల్సి ఉంటుంది.

45
యజమాని మరమ్మతులు చేయించకపోతే ఏం చేయాలి?
Image Credit : Gemini AI

యజమాని మరమ్మతులు చేయించకపోతే ఏం చేయాలి?

కొన్నిసార్లు అద్దెదారుడు పలుమార్లు చెప్పినా ఇంటి యజమాని మరమ్మతులు చేయించడానికి నిరాకరిస్తాడు. అలాంటి సందర్భాల్లో మోడల్ టెనెన్సీ యాక్ట్ అద్దెదారుడికి ప్రత్యేక హక్కును కల్పిస్తోంది. ఇంటికి అత్యవసర మరమ్మతులు అవసరమైతే, యజమాని స్పందించకపోతే అద్దెదారుడు స్వయంగా ఆ పనులు చేయించుకోవచ్చు. ఆ పనుల కోసం తన ఖర్చుతో చెల్లించిన మొత్తాన్ని అద్దె నుంచి తగ్గించుకునే హక్కు కూడా చట్టం కల్పిస్తోంది.

55
అద్దె నుంచి డబ్బులు తగ్గించుకోవాలంటే పాటించాల్సిన నిబంధనలు
Image Credit : Gemini AI

అద్దె నుంచి డబ్బులు తగ్గించుకోవాలంటే పాటించాల్సిన నిబంధనలు

అద్దెదారుడు మరమ్మతుల ఖర్చును అద్దె నుంచి తగ్గించుకునే ముందు కొన్ని నిబంధనలు పాటించాలి.

ముందుగా యజమానికి సమాచారం ఇవ్వాలి:

మరమ్మతులు చేయించుకునే ముందు యజమానికి లిఖితపూర్వకంగా లేదా స్పష్టంగా సమాచారం ఇవ్వాలి. సమస్యను పరిష్కరించేందుకు అవకాశం కల్పించాలి.

అద్దెలో 50 శాతం కంటే ఎక్కువ తగ్గించకూడదు:

చట్టం ప్రకారం ఒక నెల అద్దెలో మరమ్మతుల పేరుతో తగ్గించే మొత్తం ఆ నెల అద్దె విలువలో 50 శాతానికి మించకూడదు. ఉదాహరణకు నెలవారీ అద్దె రూ.10,000 అనుకుందాం. ఒక నెలలో గరిష్ఠంగా రూ.5,000 మాత్రమే తగ్గించుకోవచ్చు

మిగిలిన మొత్తం ఉంటే తర్వాతి నెలల్లో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద అద్దె ఇంట్లో మరమ్మతుల విషయంలో ఎవరి బాధ్యత ఏమిటో మోడల్ టెనెన్సీ యాక్ట్-2021 స్పష్టంగా పేర్కొంది. పెద్ద నిర్మాణ పనులు, ప్రధాన మరమ్మతులు ఇంటి యజమాని బాధ్యత కాగా, రోజువారీ నిర్వహణ పనులు అద్దెదారుడి బాధ్యతగా ఉంటాయి. యజమాని మరమ్మతులు చేయించకపోతే అద్దెదారుడికి చట్టపరమైన హక్కులు కూడా ఉన్నాయి. అందువల్ల అద్దె ఒప్పందం చేసుకునే ముందు ఈ నిబంధనలను తెలుసుకోవడం ఇద్దరికీ ప్రయోజనకరం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image2
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!
Related Stories
Recommended image1
EV scooter: ఫోన్ కంటే తక్కువ ధరలో స్కూటీ.. 150 కిలోమీటర్ల మైలేజ్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు
Recommended image2
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved