- Home
- Life
- Dark neck: నల్లని మెడతో ఇబ్బంది పడుతున్నారా? ముల్తానీ మట్టితో ఇలా చేస్తే మీ మెడ తెల్లగా మారుతుంది..
Dark neck: నల్లని మెడతో ఇబ్బంది పడుతున్నారా? ముల్తానీ మట్టితో ఇలా చేస్తే మీ మెడ తెల్లగా మారుతుంది..
Dark neck: కొంతమంది మగవారికి, ఆడవారికి శరీరమంతా ఒక రంగులో ఉండే మెడ మాత్రం నల్లగా ఉంటుంది. అయితే కొన్నిసింపుల్ చిట్కాలతో మెడపై ఉండే నలుపుదనాన్ని వదిలించుకోవచ్చు.

కలుషితమైన వాతావరణం, దుమ్ము, దూళి, హార్మోన్ల రుగ్మతలు, కొన్ని రకాల ఔషదాల వాడకం, చర్మ సంబంధ సమస్యల కారణంగా చాలా మంది మెడ నల్లగా మారతుంది. దాన్ని అలాగే ఉంచితే.. మెడ పూర్తిగా ముదురు రంగులోకి మారే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ నలుపు దనాన్ని తగ్గించుకోవచ్చు.
పెరుగు: పెరుగు మెడపై ఉండే నలుపు దానాన్నిచాలా సులువుగా పోగొడుతుంది. ఇందుకోసం పెరుగును మెడపై 10 నిమిషాల పాటు అప్లై చేసి నీట్ గా కడిగేయాలి. వారానికి ఒకసారి మెడపై పెరుగు మాస్క్ ను వేయడం వల్ల నలుపు దనం మటుమాయం అవుతుంది. పెరుగుతో పాటుగా పసుపు, నిమ్మ, శెనగ పిండి కూడా మెడపై నలుపుదనాన్ని పోగొడుతాయి.
ముల్తానీ మట్టి: ముల్తానీ మట్టి ముఖాన్నే కాదు.. మెడపై పేరుకుపోయిన మురికిని కూడా శుభ్రంగా చేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతిరోజూ కాసేపు ముల్తానీ ముట్టిని మెడపై అప్లై చేయాలి. దీంతో నలుపు దనం పోవడమే కాదు చర్మం కాంతివంతంగా కూడా తయారవుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే ఎసిటిక్ యాసిడ్ పిగ్మెంటేషన్ ను తేలిగ్గా వదిలిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎంత మొత్తంలో తీసుకుంటారో నీళ్లను కూడా అంతే మొత్తంలో తీసుకుని రెండింటినీ బాగా మిక్స్ చేసి మెడకు అప్లై చేయాలి. రెండు మూడు నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో మెడను నీట్ గా కడిగేయండి. రెగ్యులర్ గా దీన్ని ఫాలో అయితే మంచి ఫలితాలొస్తాయి.
బంగాళాదుంపలు: బంగాళా దుంపలు ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేస్తాయి. బంగాళా దుంపలు చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. బంగాళాదుంపల్లో ఉండే కాటకోలిస్ అనే ఎంజైమ్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. నల్లని మచ్చలను కూడా తొలగిస్తుంది. వారానికి రెండు సార్లు ఈపద్దతిని పాటిస్తే మంచి ఫలితాలను పొందుతారు.
ఆరోగ్యకరమైన ఆహారాలు, పండ్లు, సమతుల్య ఆహారం, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి అవసరమయ్యే నీళ్లను (రోజుకు 8 నుంచి 10 గ్లాసుల) తాగాలి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే చర్మంలో గ్లో వస్తుంది.
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమన్ ఇ వంటి పోషకాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.