High Blood Pressure: హై బీపీ తగ్గాలంటే ఇలా చేయండి..
High Blood Pressure: ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే దీన్ని కొన్ని సింపుల్ చిట్కాలతో నియంత్రించొచ్చు.

ఈ రోజుల్లో చిన్న వయసు వారు సైతం అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఇక బీపీని తగ్గించేందుకు ఎన్నో మందును వాడుతుంటారు. అయితే వీటికి బదులుగా కొన్ని ఇంటి చిట్కాలతో కూడా హై బీపీకి చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. హై బీపీతో సతమతమయ్యే వారు ఈ చిట్కాలను పాటిస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సీజన్ పండ్లు, కూరగాయలు
సీజన్ పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల రోగాలను తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా వీటిని రెగ్యులర్ గా తింటే అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. రెగ్యులర్ గా ఒక యాపిల్ ను తిన్నా.. బీపీ రోజంతా నియంత్రణలోనే ఉంటుంది.
ద్రాక్షపండ్లు
తియ్య తియ్యగా పుల్ల పుల్లగా ఉండే ద్రాక్షపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ద్రాక్షపండ్లను తినడం వల్ల హార్ట్ బీట్ రేట్ కూడా మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది ఎన్నో రకాల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇది అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
దానిమ్మ
దానిమ్మ శరీరానికి ఎన్నో విధాల మంచి చేస్తుంది. ఈ పండును తింటే శరీరంలో రక్తలోపం ఏర్పడదు. అలాగే గుండె జబ్బులను కూడా దూరం చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ పండును తినడం వల్ల హై బీపీ నియంత్రణలో ఉంటుంది.
ఉల్లిపాయ
ఉల్లిలో శరీరానికి మేలు చేసే గుణాలెన్నో ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఆక్సీకరణ ప్రక్రియ మెరుగ్గా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఉల్లిపాయ హెయిర్ ఫాల్, డాండ్రఫ్ సమస్యను తొలగించి జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగేందుకు సహాయపడుతుంది.
ఉసిరి రసం
ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే ఫ్రెష్ ఉసిరి రసాన్ని టేబుల్ స్పూన్ తీసుకుని అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. ఉసిరి జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తుంది.