MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Body Pain: బాడీ పెయిన్స్ తో ఇబ్బందిపడుతున్నారా? ఇలా చేయండి వెంటనే ఉపశమనం లభిస్తుంది..

Body Pain: బాడీ పెయిన్స్ తో ఇబ్బందిపడుతున్నారా? ఇలా చేయండి వెంటనే ఉపశమనం లభిస్తుంది..

Body Pain: ఏం చేసినా బాడీ పెయిన్స్ నుంచి విముక్తి పొందలేక పోతున్నారా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 16 2022, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బాడీ పెయిన్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని నుంచి గట్టెక్కేందుకు ఎన్నో చిట్కాలను ట్రై చేస్తుంటారు కూడా. అయినా నొప్పి మాత్రం అస్సలు తగ్గదు. అలాంటి వారికి కొన్ని ఇంటి చిట్కాలు చక్కగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు ఇవి మీపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా చూపవు. ఇంతకీ బాడీపెయిన్స్ ను తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలో తెలుసుకుందాం పదండి.

25

అల్లం.. బాడీ పెయిన్స్  నుంచి ఉపశమనం కలిగించడంలో అల్లం దివ్య ఔషదంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో శరీర నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉంటాయి. ఇందుకోసం కొంచెం అల్లాన్ని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక గుడ్డలో కట్టండి. ఇప్పుడు ఆ గుడ్డను గోరువెచ్చని నీళ్లలో కొన్ని నిమిషాల పాటు ఉంచండి. ఆ నీళ్లు చల్లారిన తర్వాత.. శరీరంలో ఎక్కడెక్కడ నొప్పి ఉందో అక్కడ అప్లై చేయండి. 

35

పసుపు పాలు.. శరీర నొప్పులను తగ్గించడానికి పసుపు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే పసుపులో నొప్పులను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇవి శరీర నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు పసుపు పాలను తాగితే నొప్పులు క్షణాల్లో తగ్గిపోతాయి. లేదంటే ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో.. అక్కడ పసుపు పేస్ట్ ను రాయండి. తొందరగా ఉపశమనం లభిస్తుంది. 

45

దాల్చిన చెక్క.. దాల్చిన చెక్క ఎన్నో రోగాలను నయం చేస్తుంది. ముఖ్యంగా ఇది ఆర్థరైటిస్, శరీర నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్కలలో యాంటీ  ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పులను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. 

55
ice pack

ice pack

ఐస్ ప్యాక్.. ఐస్ ప్యాక్ కూడా నొప్పులను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం శరీరంలో ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో.. అక్కడ ఐస్ క్యూబ్స్ ను ను 10 నిమిషాల పాటు పెట్టండి. రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేస్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. కానీ కాస్త లేట్ గా నొప్పులు తగ్గుతాయి.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Curly Hair: సాక్సులతో సింపుల్ గా హెయిర్ కర్ల్స్ ఎలా చేయాలో తెలుసా?
Recommended image2
Weight Loss: ఈ సూప్ తాగితే.. నెలరోజుల్లో బరువు తగ్గడం చాలా ఈజీ..!
Recommended image3
Fridge Placement: ఫ్రిజ్‌కి, గోడకి మధ్య గ్యాప్ ఎంత ఉంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved