Home Decor: ఇల్లు చిన్నగా ఉందని బాధపడుతున్నారా.? ఇలా చేస్తే రిచ్ లుక్ ఖాయం
Home Decor: ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది తక్కువ స్థలంలో ఇంటిని నిర్మించుకుంటారు. దీంతో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే సరైన ప్లానింగ్ ఉంటే అదే ఇల్లు అందంగా, విశాలంగా, లగ్జరీగా మారుతుంది. అలాంటి కొన్ని టిప్స్ ఇప్పుడు చూద్దాం.

లైట్ కలర్స్‌తో ఇల్లు పెద్దగా కనిపించేలా చేయండి
చిన్న ఇళ్లలో రంగుల ఎంపిక చాలా కీలకం. గోడలు, సీలింగ్, ఫర్నిచర్‌కు లైట్ కలర్స్ ఎంచుకుంటే ఇల్లు విశాలంగా కనిపిస్తుంది. వైట్, క్రీమ్, లైట్ గ్రే, లైట్ బ్లూ, పింక్ షేడ్స్ గదిలో వెలుతురును బాగా వ్యాప్తి చేస్తాయి. డార్క్ కలర్స్ చిన్న గదుల్లో ఇల్లు ఇంకా చిన్నగా కనిపించేలా చేస్తాయి. కర్టెన్లు, బెడ్ షీట్లు, కుషన్ కవర్లు కూడా లైట్ కలర్స్‌లో ఉంటే ఇల్లు క్లాసీగా ఉంటుంది.
మల్టీ యూజ్ ఫర్నిచర్‌ను ఎంచుకోండి
చిన్న ఇంట్లో పెద్ద పెద్ద ఫర్నిచర్ ఉంటే స్థలం త్వరగా నిండిపోతుంది. అందుకే తేలికపాటి, సింపుల్, మల్టీ యూజ్ ఫర్నిచర్ వాడటం మంచిది. సోఫా-కమ్-బెడ్, ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్, స్టోరేజ్ ఉన్న బెడ్, గోడకు అమర్చే షెల్ఫ్‌లు చిన్న ఇళ్లకు చాలా ఉపయోగపడతాయి. ఇవి స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా ఇంటిని మోడర్న్‌గా కనిపించేలా చేస్తాయి.
అద్దాల వాడకంతో ఇల్లు విశాలంగా కనిపిస్తుంది
చిన్న ఇంటిని పెద్దగా చూపించడానికి అద్దాలు చాలా ఉపయోగపడతాయి. గోడపై పెద్ద మిరర్ పెట్టితే గది రెట్టింపు పరిమాణంలో కనిపిస్తుంది. అద్దాలు లైట్‌ను రిఫ్లెక్ట్ చేయడంతో గది బ్రైట్‌గా, ఓపెన్‌గా ఉంటుంది. లివింగ్ రూమ్, డైనింగ్ ఏరియా లేదా బెడ్‌రూమ్‌లో ఒక పెద్ద అద్దం పెట్టొచ్చు. మిరర్ ఉన్న అల్మారాలు లేదా ఫర్నిచర్ వాడితే లగ్జరీ టచ్ వస్తుంది.
అవసరం లేని వస్తువులు తొలగించండి
చిన్న ఇల్లు శుభ్రంగా, క్రమంగా ఉంటేనే అందంగా కనిపిస్తుంది. అవసరం లేని సామాన్లు ఇంటిని గందరగోళంగా చేస్తాయి. కాబట్టి వాడని వస్తువులను తొలగిస్తూ ఉండాలి. స్టోరేజ్ బాక్సులు, బాస్కెట్లు, క్యాబినెట్లను సరిగ్గా వాడాలి. ఫ్లోర్‌పై ఎక్కువ సామాన్లు పెట్టకుండా చూసుకుంటే ఇల్లు పెద్దగా కనిపిస్తుంది.
మంచి లైటింగ్‌తో లగ్జరీ ఫీల్ తీసుకురండి
చిన్న ఇంటి లుక్‌ను పూర్తిగా మార్చగలిగేది లైటింగ్. వామ్ వైట్ లేదా సాఫ్ట్ వైట్ లైట్స్ ఇల్లు ఆహ్లాదకంగా చూపిస్తాయి. వాల్ లైట్స్, కార్నర్‌లో ఫ్లోర్ ల్యాంప్‌లు, సీలింగ్‌లో సింపుల్ ఎల్ఈడి లైట్స్ పెట్టొచ్చు. పగటి వేళ సహజ కాంతి ఇంట్లోకి రావడానికి అవకాశం ఇవ్వాలి. మందపాటి తెరలకన్నా లైట్ కర్టెన్లు వాడితే సూర్యకాంతి సులువుగా లోపలికి వస్తుంది.

