శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఈ డేంజర్ రోగాలు పక్కా వస్తాయి.. జాగ్రత్త మరి
ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతే ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. వీటివల్ల కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు.

High Cholesterol
చెడు కొలెస్ట్రాల్ ను సైలెంట్ కిల్లర్ అనికూడా ఉంటారు. సాధారణంగా ఇది ఎలాంటి లక్షణాలను చూపకుండా ప్రాణాలను సులువుగా తీసేస్తుంది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ధమనులు ఇరుగ్గా మారతాయి. దీంతో వాటి గుండా రక్తం ప్రవహించడం కష్టమవుతుంది. పేలవమైన జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం, లేదా మొత్తమే లేకపోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తాయి. దీనివల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొరోనరీ హార్ట్ డిసీజ్
కొరోనరీ హార్ట్ డిసీజ్ అనేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల గోడలో ఫలకం ఏర్పడటం వల్ల సంభవించే అత్యంత సాధారణ వ్యాధుల్లో ఒకటి. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయినప్పుడు ధమనులు ఇరుగ్గా మారతాయి. దీనినే అథెరోస్క్లెరోసిస్ అంటారు. దీనివల్ల గుండెకు రక్తం సరిగ్గా సరఫరా కాదు. అలాగే ఆక్సిజన్ సరఫరా సరిగ్గా ఉండదు. ఇది రక్తప్రవాహాన్ని పరిమితం చేస్తుంది.
heart attack
గుండెపోటు
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది. ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాల్లో కొవ్వు నిక్షేపాలు బాగా పేరుకుపోతాయి. దీనివల్ల ధమనుల గుండా తగినంత రక్తం ప్రవహించలేదు. అంటే దీనివల్ల గుండెకు సరిపడా రక్తం చేరుకోలేదు. అంతేకాదు ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
stroke
స్ట్రోక్
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే స్ట్రోక్ కూడా వస్తుంది. నిజానికి చెడు కొలెస్ట్రాల్ గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్ ను మోసుకెళ్లే ధమనులను నిరోధించడమే కాకుండా మెదడుకు చేరు ధమనుల్లో కూడా అడ్డంకిని కలిగిస్తుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఎంతో మంది అర్థాంతరంగా చనిపోతున్నారు.
erectile dysfunction
అంగస్తంభన లోపం
ఈ రోజుల్లో యువకులు కూడా అంగస్తంభన లోపంతో బాధపడుతున్నారు. ఇది పురుషుల్లో సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. అంగస్తంభన లోపానికి , చెడు కొలెస్ట్రాల్ కు మధ్య సంబంధం ఉందని ఎన్నో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ కారణంగా ఎంతో మంది పురుషులు తండ్రులు కాలేకపోతున్నారు.