Telugu

Gardening: ఈ మొక్కలు పెంచడానికి కొమ్మలు ఉంటే చాలు..!

Telugu

కొమ్మలతో పెరిగే పూల మొక్కలు..

గులాబీ, మందార, మల్లె, బొండు మల్లె, డాలియా, వంటి పూల మొక్కలను కొమ్మల ద్వారా చాలా సులభంగా పెంచొచ్చు. 

Image credits: Storyblocks
Telugu

తీగ జాతి మొక్కలైతే..

మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, టర్టిల్ వైన్, మాన్‌స్టెరా వంటి మొక్కలను కూడా ఈ పద్ధతిలో పెంచవచ్చు.

Image credits: Getty
Telugu

మొక్క నాటే సరైన పద్ధతి

గుర్తుంచుకోండి.. కొమ్మ 4-6 అంగుళాల పొడవు (అరచేతి పొడవు కంటే కొంచెం ఎక్కువ) ఉండాలి. 2-3 కణుపులు ఉన్న ఆరోగ్యకరమైన కొమ్మను ఎంచుకోవాలి.

Image credits: Instagram
Telugu

ఇలా కత్తిరించండి

కొమ్మ కింది భాగంలో ఉన్న ఆకులను తీసేయండి. కొమ్మను నిలువుగా కాకుండా, ఒక వైపుకు ఏటవాలుగా (క్రాస్‌గా) కత్తిరించాలి.

Image credits: Instagram
Telugu

ఇలా నాటాలి

ఇలా కత్తిరించిన కొమ్మను నీటిలో లేదా తేమగా ఉన్న మట్టిలో నాటి, నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి.

Image credits: Instagram
Telugu

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి, కానీ ఎక్కువ నీళ్లు పోయవద్దు. సాధారణంగా 10-20 రోజుల్లో వేర్లు రావడం మొదలవుతుంది. 3-4 వారాల్లో కొత్త మొక్క సిద్ధమవుతుంది.

Image credits: Instagram

Plants:బియ్యం కడిగిన నీళ్లలో ఇది కలిపి పోస్తే మొక్కలు వేగంగా పెరుగతాయి

Passion Fruit: ప్యాషన్ ఫ్రూట్ ఇంట్లో పెంచాలా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

Money Plant:మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఈ నీళ్లు పోసినా చాలు

Indoor Plants: బల్లుల్ని తరిమికొట్టే 7 మొక్కలు.. ఇంట్లో ఇవి ఉంటే చాలు, ఆ వాసనకే పరార్!