High blood pressure: మెడిసిన్స్ లేకుండానే హైబీపీని తగ్గించే చిట్కాలివిగో..
High blood pressure: అధిక రక్తపోటు సమస్య ముదిరితే.. జీవితాంతం మెడిసిన్స్ ను వాడాల్సిస వస్తుంది. అయితే మెడిసిన్స్ వేసుకోకుండానే హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే ఈ చిట్కాలను పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

High blood pressure: ప్రస్తుత కాలంలో దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదకరమైన రోగాలు కూడా సర్వసాధారణం అయ్యాయి. ముఖ్యంగా ప్రస్తుతం అధిక రక్తపోటుతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులోనూ చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా ఈ సమస్య బారిన పడుతున్నారు. హై బీపీ సమస్య చాలా చిన్నదిగా అనిపించినా ఇది రోజులు గడుస్తున్న కొద్దీ హార్ట్ ప్రాబ్లమ్స్ కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మారిన లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి వివిధ కారణాల వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి ప్రతిరోజూ ట్యాబ్లెట్లను వేసుకునే వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలను పాటిస్తే రెగ్యులర్ గా మందులను వాడాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజూ వ్యాయామం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్ గా ఉండటమే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా హైబీపీ పేషెంట్లు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే.. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఎక్సర్ సైజెస్ తో పాటుగా ధ్యానం, యోగా వంటివి చేసినా హై బీపీ నుంచి బయటపడొచ్చు. అంతేకాదు వీటివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
డైట్ ను మెరుగుపర్చాలి.. హైబీపీ పేషెండ్లు తాము తీసుకునే ఆహారపదార్థాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ఎంతో అవసరం. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు బీపీని నియంత్రణలో ఉంచితే మరికొన్ని ఆహారాలు మాత్రం బీపీని పెంచుతాయి. కాగా బీపీ నియంత్రణలో ఉండాలంటే ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిది.
స్మోకింగ్, డ్రింకింగ్.. హైబీపీ పేషెంట్లు స్మోకింగ్, డ్రింకింగ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ అలవాట్లు బీపీని మరింత పెంచుతాయి. నిజం చెప్పాలంటే బీపీ పెరిగేది ఈ అలవాట్ల వల్లే నని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడికి దూరంగా ఉండాలి.. అధిక ఒత్తిడి వల్ల కూడా బీపీ విపరీతంగా పెరుగుతుంది. అందుకే పనిలో ఒత్తిడి కలిగితే దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం యోగాను చేయండి. అలాగే రెగ్యులర్ గా బీపీ చెకప్ చేయించుకోండి.