MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? అయితే పరిగడుపున వీటిని తినండి.. కంట్రోల్ అవుతుంది..

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? అయితే పరిగడుపున వీటిని తినండి.. కంట్రోల్ అవుతుంది..

అధిక రక్తపోటు ప్రాణాలను కూడా తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే దీనిని ఎప్పుడూ నియంత్రణలోనే ఉంచుకోండి.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 02 2022, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈ రోజుల్లో చిన్న వయసు వారు కూడా అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బీపీ పెరిగితే ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అందుకే దీన్ని కంట్రోల్ లోనే ఉంచుకోవాలి. అయితే కొన్ని రకాల  ఆహారాలను అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..
 

28

వేరుశెనగలు

వేరుశెనగలను ఇష్టపడని వారుండరు. ఇవి టేస్టీగానే కాదు.. ఈ గింజల్లో ఎన్నో ఔషదగుణాలున్నాయి. అందుకే వీటి ధర మార్కెట్ లో కాస్త ఎక్కువగా ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  ప్రతిరోజూ గుప్పెడు వేరువెనగ గింజలు తినడం వల్ల మీ శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా తొలగిపోతుంది.
 

38

మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే .. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అధిక బరువు, డయాబెటీస్ వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి వారు గుప్పెడు వేరుశెనగ గింజలను తినడం వల్ల ఇలాంటి రోగాల ప్రమాదం తప్పుతుంది. ఎందుకంటే ఈ గింజలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొలగించడానికి సహాయపడుతాయి. 
 

48

బాదం పలుకులు కూడా శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తొలగించేందుకు సహాయపడతాయి. మీకు తెలుసా..? క్రమంతప్పకుండా గుప్పెడు వేరుశెనగలు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే మంచిది. ఈ నానబెట్టిన గింజలు డయాబెటీస్ ను అదుపులో ఉంచుతాయి.  బాదం పలుకులను కూడా ఇలాగే తింటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. 
 

58

అయితే వెయిట్ ఎక్కువగా ఉన్న వారు నట్స్ ను దూరం పెడుతుంటారు. ఎక్కడ వీటిని తింటే మరింత బరువు పెరిగిపోతామేమోనని. కానీ అది తప్పుడు ఆలోచన. ఎందుకంటే వేరుశెనగలను తింటే బరువు పెరగరు. ముఖ్యంగా ఇవి మీ శరీర బరువు మరింత పెరగకుండా అడ్డుకుంటాయి కూడా. 

68

వీటిని తినడం వల్ల మీ శరీర బలం పెరుగుతుంది. వేరుశెనగల్లో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.  ప్రతిరోజూ వేరుశెనగలను తినడం వల్ల మీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఈ గింజలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. 

78

జీడిపప్పులు

జీడిపప్పులు తింటే బరువు పెరిగిపోతామని వీటిని ముట్టని వారు చాలా మందే ఉన్నారు. నిజానికి అదంతా అబద్దం.. నిజమేంటంటే.. ఇది మీ బరువును పెంచడానికి బదులుగా.. బరువును కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో 2 నుంచి 3 జీడిపప్పులను తినడం శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే శరీర శక్తిని కూడా పెంచుతుంది. వీటిలో పిస్తాపప్పు ఇతర గింజల కంటే ఎక్కువ పోషకాలుంటాయి. ఇది రుచిగానే కాదు.. మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఈ గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి. 
 

88

బాదం

బాదం లేదా వేరుశెనగ పప్పులను పడుకునే ముందు నానబెట్టి ఉదయాన్నే తినండి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ ఇ ,మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం  తగ్గుతాయి. సమస్యలు కూడా అదుపులో ఉంటాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Manthena Hair Care Tip: ఈ సీక్రెట్‍తో వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది
Recommended image2
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Recommended image3
Curry Leaves: కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved