MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hotel Hygiene: హోటల్ రూంలో ఇవి అస్సలు వాడొద్దు...ఎందుకో తెలుసా?

Hotel Hygiene: హోటల్ రూంలో ఇవి అస్సలు వాడొద్దు...ఎందుకో తెలుసా?

Hotel Hygiene: హోటల్ గదుల్లోని టీవీ రిమోట్లు, కెటిల్స్, బెడ్ స్ప్రెడ్స్ వంటి వస్తువులను తరచుగా సరిగ్గా శుభ్రం చేయరని చెబుతుంటారు. వీటిపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రయాణికులు వీటిని వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.

2 Min read
Author : Nandini Arava
Published : May 18 2026, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మైమరిచిపోతే బోల్తా పడినట్లే...
Image Credit : Getty

మైమరిచిపోతే బోల్తా పడినట్లే...

ఏ హోటల్‍కి వెళ్లినా అక్కడ రూంలు చాలా అందంగా కనిపిస్తాయి. తెల్లటి బెడ్ షీట్లు, పొడవాటి అద్దాలు, సువాసన వెదజల్లే రూం ఫ్రెషనర్లతో మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. అబ్బా ఎంత బాగుందో, ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. ఎంత నీట్ గా ఉంచారో, మన ఇల్లు కూడా ఇలానే ఉంచుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటారు. అక్కడే మీరు పప్పులో మీరు కాలేశారు. పైకి శుభ్రంగా కనిపించే కొన్ని వస్తువుల్లోనే ఎన్నో క్రిములు దాగి ఉంటాయంట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టీవీ రిమోట్‌లో ఎక్కువ క్రిములు ఉండొచ్చు
Image Credit : Getty

టీవీ రిమోట్‌లో ఎక్కువ క్రిములు ఉండొచ్చు

హోటల్స్ లో టీవీ, టీ కెటిల్స్, గ్లాసులు, దుప్పట్లు ఉంటాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది వాడతారు కాబట్టి క్రిములు పేరుకుపోయి ఉంటాయి. సిబ్బంది కడిగినా కూడా దాంట్లో ఉండిపోతాయి. ముఖ్యంగా బటన్లు, అంచుల దగ్గర దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా చాలా కాలం పాటు ఉండిపోతుంది. అందుకే రిమోట్‌ను వాడే ముందు శానిటైజర్ వైప్స్‌తో తుడవడం అలవాటు చేసుకోవాలి. 

Related Articles

Related image1
Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
Related image2
Moon Hotel : భూమిపై కాదు.. ఇక చంద్రుడిపై హనీమూన్ ! ఒక్క నైట్ రేటు మైండ్ బ్లాక్ !
35
అలంకరణ కుషన్, కెటిల్
Image Credit : Getty

అలంకరణ కుషన్, కెటిల్

మంచం మీద అందం కోసం పెట్టే డెకరేటివ్ కుషన్లు, రంగురంగుల బట్టలను తరచుగా శుభ్రం చేయరు. చాలామంది వాటిపై బ్యాగులు, బూట్లు పెడుతుంటారు. దీనివల్ల క్రిములు సులభంగా వ్యాపిస్తాయి. అలాగే, ఎలక్ట్రిక్ కెటిల్ లేదా కాఫీ మేకర్లను సరిగ్గా కడగకపోతే, వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. అందుకే మీరు వెళ్లాక వాటిని వైప్స్ తో తుడుచుకోవడం బెటర్.

45
గ్లాసులు, డోర్ హ్యాండిల్స్‌తో కూడా ప్రమాదమే
Image Credit : Getty

గ్లాసులు, డోర్ హ్యాండిల్స్‌తో కూడా ప్రమాదమే

కొన్ని హోటళ్లలో బాత్రూమ్ దగ్గర పెట్టే మంచి నీటి గ్లాసులను సరిగ్గా శుభ్రం చేయకపోవచ్చు. కొన్నిసార్లు కేవలం నీటితో కడిగేస్తారని కూడా వార్తలొచ్చాయి. డోర్ హ్యాండిల్స్, లైట్ స్విచ్‌లు, ఫోన్, కర్టెన్ హ్యాండిల్స్ వంటివి కూడా ఎక్కువగా తాకుతారు కాబట్టి, అక్కడ క్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే అవి వాడిన ప్రతిసారీ చేతులను కడుక్కోవాలి. లేదా వైప్స్ వాడాలి.

55
ప్రయాణికులు చేయాల్సిన ముఖ్యమైన పనులు
Image Credit : Getty

ప్రయాణికులు చేయాల్సిన ముఖ్యమైన పనులు

కరోనా తర్వాత హోటల్ శుభ్రతపై జనాల్లో అవగాహన పెరిగింది. ఇప్పుడు చాలామంది ప్రయాణికులు తమతో పాటు శానిటైజర్లు, వైప్స్ తీసుకెళ్తున్నారు. హోటల్ గ్లాసులను మళ్లీ కడుక్కోవడం, రిమోట్, డోర్ హ్యాండిల్స్‌ను శుభ్రం చేసుకోవడం, డెకరేటివ్ కుషన్లను వాడకపోవడం వంటి చిన్న జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీకు వీలుంటే హోటల్ లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే…కెటిల్, గ్లాసులు, దుప్పట్లు తీసుకెళ్లడం మరీ మంచిది. వీలైతే అలా ట్రై చేయండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Chutney: జుట్టు బాగా పెరగాలంటే ఈ చట్నీని అన్నం, ఇడ్లీ, దోశెలతో ప్రతిరోజూ తినండి
Recommended image2
Tomato Storage: ఎన్నిరోజులైనా టమాటాలు తాజాగా ఉండాలంటే ఇది ఉండాలి
Recommended image3
Blouse Designs: శ్రావణమాసంలో చీరతో ఈ 7 స్టైలిష్ బ్లౌజులు ట్రై చేయండి
Related Stories
Recommended image1
Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image2
Moon Hotel : భూమిపై కాదు.. ఇక చంద్రుడిపై హనీమూన్ ! ఒక్క నైట్ రేటు మైండ్ బ్లాక్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved