కొబ్బరి నూనెతో మీరెంత అందంగా మారిపోతారో..!
కొబ్బరి నూనె మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు తెలుసా?
নারকেল তেল ও কর্পূর
కొబ్బరి నూనె బహుముఖ, సహజ పదార్ధం. ఇది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని మన రోజువారి చర్మ సంరక్షణలో ఉపయోగించడం వల్ల ఎన్నో స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. కొబ్బరి నూనె మన చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటుగా ఎన్నో సమస్యలను కూడా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.
coconut oil
కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీనిలోని ఔషద గుణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, అందంగా కనిపిస్తుంది. కొబ్బరి నూనె చర్మ రంగును కూడా మెరుగుపరుస్తుంది. అసలు కొబ్బరి నూనె మన చర్మానికి ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పడు తెలుసుకుందాం..
డీప్ హైడ్రేషన్
కొబ్బరి నూనె ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్. ఇది చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ముఖ్యంగా పొడిగా, పొరలుగా ఉండే చర్మానికి కొబ్బరి నూనె మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.
యాంటీ ఏజింగ్ లక్షణాలు
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కొబ్బరి నూనెలో పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించి ముఖంపై ముడతలు, సన్నని గీతలు వంటి అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
Image: Getty Images
జెంటిల్ మేకప్ రిమూవర్
కొబ్బరి నూనె సున్నితమైన, సమర్థవంతమైన మేకప్ రిమూవర్ గా కూడా పనిచేస్తుంది. చికాకు కలిగించకుండా మొండి మేకప్ ను, మలినాలను సులువుగా పోగొడుతుంది. దీంతో మీ చర్మం తాజాగా కనిపిస్తుంది.
Image: Getty Images
చికాకును తగ్గిస్తుంది
కొబ్బరి నూనెలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెను ఉపయోగించి తామరను తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనె చర్మశోథ, వడదెబ్బలు వంటి చర్మపు చికాకులను తగ్గిస్తుంది. చర్మం తొందరగా కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది.
చర్మ స్థితిస్థాపకతను పెంచుతుంది
కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మ స్థితిస్థాపకత మెరుగుపడుతుంది. ఇది మరింత యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలాగేస్ట్రెచ్ మార్క్స్ రూపాన్ని కూడా తగ్గిస్తుంది.