జుట్టు రాలడానికి ఇదే కారణం.. ఇలా చేస్తే మీ జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది
జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో పోషకాల లోపం కూడా ఒకటి. అయితే కొన్ని ఆహారాలను తీసుకుంటే మీ జుట్టు ఊడటం ఆగి పొడుగ్గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Image: Getty
ఈ ఎండాకాలంలో దుమ్ము, ధూళి, కాలుష్యం, ఎండలోని హానికరమైన కిరణాల ప్రభావం, చెమట వల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. ఇవి జుట్టు రాలడానికి కారణమవుతాయి. వీటితో పాటుగా శరీరంలో పోషకాలు లోపించడం వల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఉంది. రక్తపోటు, డయాబెటిస్, అసమతుల్య బరువు వంటి అన్ని జీవనశైలి సమస్యలు కూడా జుట్టు రాలేలా చేస్తాయి. అయితే కొన్ని జ్యూస్ లు జుట్టుకు పోషణను అందించి బాగా పెరిగేలా చేస్తాయి. అవేంటటే..
బచ్చలికూర రసం
పబ్మెడ్ సెంట్రల్ ప్రకారం.. బచ్చలికూరలో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, కెరోటినాయిడ్లు, రాగి వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టుకు చాలా అవసరం. జుట్టు రాలకూడదంటే పాలకూర జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోండి.
ఉసిరి జ్యూస్
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉండే అధికంగా ఉండే ఉసిరి జ్యూస్ మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది తెలుసా? పబ్ మెడ్ సెంట్రల్ పరిశోధన ప్రకారం.. జుట్టుకు అవసరమైన ఫుడ్స్ లో ఉసిరి ఒకటి. ఇది మీ నెత్తిమీద కణాల నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో కొత్త జుట్టు పెరుగుతుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.
cucumber juice
కీరదోసకాయ రసం
కీరదోసకాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయి. అలాగే నెత్తికి ఆర్ద్రీకరణను అందిస్తుంది. కీరదోసకాయల్లో ఉండే విటమిన్ ఎ సెబమ్ ఉత్పత్తిని సమతుల్యంగా ఉంచుతుంది. దీంతో హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యంగా ఉంటాయి.
kiwi juice
కివి జ్యూస్
కివి మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు ఇది మన జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. కివి పండులో మంచి మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది జుట్టు పెరిగేందుకు అవసరం. ఇది నెత్తిని కూడా శుభ్రపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
garlic
వెల్లుల్లి రసం
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. వెల్లుల్లి జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ కు తగినంత పోషణను అందించి జుట్టు నాణ్యతను పెంచుతుంది. దీన్ని తలకు, జుట్టుకు అప్లై చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టుకు సహజ మెరుపునిచ్చి జుట్టును మృదువుగా చేస్తుంది.
కొత్తిమీర రసం
కొత్తిమీర ఆకులతో చేసిన జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. దీన్ని తాగడంతో పాటుగా కొత్తిమీర పేస్ట్ ను తయారుచేసి తలకు అప్లై చేయొచ్చు.