మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జర ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
డయాబెటీస్, ధూమపానం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి రోగాలు, అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలైతే ఏకంగా గుండెపోటు బారిన పడేలా చేస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటమే మేలు..
మానవ శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. కానీ నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కార్డియోవాస్కులర్ డిసీజ్ తోనే చనిపోతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి వల్లే గుండె ప్రమాదంలో పడుతోంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మధుమేహం, రక్తపోటు, ధూమపానం, ఊబకాయం వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది. మంచి ఆహారం, వ్యాయామం, సరైన జీవనశైలి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం పదండి..
రెడ్ మీట్
ఎర్ర మాంసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ గుండెను ప్రమాదంలో నెట్టేస్తుంది. బేకన్, సాసేజ్, హాట్ డాగ్ వంటి ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ ను తినకపోవడమే మంచిది. రెడ్ మీట్ గుండెకు మాత్రమే కాదు.. మొత్తం శరీరానికి కూడా మంచిది కాదు.
చక్కెర, ఉప్పు
చక్కెర, ఉప్పును ఎక్కువ మొత్తంలో తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉప్పు అధిక రక్తపోటును పెంచితే.. చక్కెర రక్తంలో షుగల్ లెవెల్స్ ను పెరుగుతాయి. దీనివల్ల గుండె ప్రమాదంలో పడుతుంది.
ప్యాకేజ్డ్ ఫుడ్స్
ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. బేకరీ స్నాక్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఎందుకంటే వీటిలో చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది.
soft drinks
శీతల పానీయాలు
శీతల పానీయాలు, సోడాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సోడాలో ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరానికి కాల్షియంను శోషించుకునే సామర్థ్యాన్ని నిరోధిస్తుంది. శరీరంలో తగినంత కాల్షియం లేనప్పుడు.. ఎముకలు బలహీనపడతాయి. బోలు ఎముకల వ్యాధి, దంత క్షయం వంటి సమస్యలు కూడా వస్తాయి. అధిక బరువు, ఉబ్బరం, గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది.
వైట్ బ్రెడ్
సాధ్యమైనంత వరకు బ్రెడ్, పాస్తాల వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి కావు. వీటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెరను ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మధుమేహానికి దారితీస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.