MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గుండె జబ్బుల విషయంలో వీటిని నమ్మకండి..

గుండె జబ్బుల విషయంలో వీటిని నమ్మకండి..

కొన్ని విషయాలను గురించి అతిగా ఆలోచించడం మానుకోవడం మంచిది. ముఖ్యంగా గుండెజబ్బుల విషయంలో. లేనిపోనివి ఊహించుకుంటే  ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది మరి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 26 2022, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు గుండెజబ్బులే ప్రధాన కారణమంటున్నాయి సర్వేలు. గుండె జబ్బులతో ప్రతి ఏడాది 17.9 మిలియన్ల మంది చనిపోతున్నారు. అందుకే గుండె జబ్బులు అంటే కొంతమందికి ఎక్కడ లేని భయం పుట్టుకొస్తుంది. అయితే కొంతమందికి గుండె జబ్బుల విషయంలో లేనిపోని విషయాలను నమ్ముతారు. కొన్ని అపోహలను నమ్మడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అసలు గుండె జబ్బుల విషయంలో అపోహలేంటి? నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

అపోహ: నేను యువకుడిని.. నాకు గుండెజబ్బులు రావు

నిజం: ఒకప్పుడు గుండె జబ్బులు వృద్ధులకే వచ్చేవి. అందుకే చాలా మంది దీన్ని నమ్ముతారు. అసలు నిజమేంటంటే.. ఇప్పుడు గుండె జబ్బుల కేవలం వృద్ధులకే కాదు.. యువకులకు కూడా వస్తున్నాయి. గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ లేదా ఆగిపోవడం వంటివి యువకులకు కూడా వస్తున్నాయి. అయినా ఈ మధ్య యువకులు గుండెపోటుతో చనిపోయిన వార్తలను చూసే ఉంటారుగా.. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడికి ఎక్కువగా గురవ్వడం, కొన్ని రకాల మందుల వాడకం వల్ల యువతలో గుండె జబ్బులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులు రాకూడదంటే లైఫ్ స్టైల్ ను మెరుగ్గా ఉంచుకోవాలి. 
 

34
Heart Health

Heart Health

అపోహ: నాకు గుండె జబ్బుల చరిత్ర ఉంది.. నేను దాన్నిఏం చేసినా తగ్గించలేను

నిజం:  కుటుంబ చరిత్రను కలిగి ఉండటం వల్ల గుండెపోటు లేదా గుండె వైఫల్యం వంటి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ గుండె సమస్యలకు దూరంగా ఉండేందుకు కొన్ని చర్యలను తీసుకోవచ్చు. వీటివల్ల మీకు గుండె జబ్బులొచ్చే అవకాశం తగ్గుతుంది. అవును ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలకు బదులుగా పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తినాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడి లేకుండా జీవించాలి. అలాగే రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.  అలాగే తరచుగా గుండె చెకప్ లను చేయించుకోవాలి. మీ గుండె ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 

44

అపోహ: ఛాతిలో నొప్పి మాత్రమే గుండెపోటుకు సంకేతం

నిజం: ఛాతిలో నొప్పి కేవలం గుండెపోటు వల్లే రాదు. దీనికి ఇంకెన్నో కారణాలు కూడా ఉన్నాయి. కానీ గుండెపోటు లక్షణాల్లో ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, గుండెల్లో మంట, పొత్తికడుపు పై నొప్పి, వాంతులు, వికారం, దవడ నొప్పి, వెన్ను నొప్పి, అలసట, మైకము, విపరీతమైన చెమట పట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి మామూలే అని లైట్ తీసుకోకూడదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. ఏ మాత్రం లేట్ చేసినా మీ ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
White Dress: వేసవిలో ఈ వైట్ డ్రెస్సులు ఆఫీసులకు అందంగా ఉంటాయి
Recommended image2
Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు అంత ఫాస్ట్ గా ఎలా పెరుగుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved