Heart Attack Risk: ఈ కూరగాయలు తింటే గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది..
Heart Attack Risk: గుండెను ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

heart attack
ఈ రోజుల్లో హార్ట్ పేషెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అందులోనూ గుండెపోటు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ఒకప్పుడు గుండెపోటు పెద్దవయసు వారికే వచ్చేది. ఇప్పుడు 30 ఏండ్ల వారు కూడా దీనిబారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల గుండెపోటు బారిన పడుతున్నారు.
అయితే ముడి కూరగాయలు గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్, ఇతర ముఖ్యపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సమతుల్య ఆహారాలను తినడం వల్ల ఎన్నో రోగాలు తగ్గిపోతాయి కూడా. ఇందుకోసం పోకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గుండె పోటు ప్రమాదం తగ్గాలంటే ఎలాంటి కూరగాయలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
পালং শাক
సోయాబీన్స్, బ్రోకలీ, బంగాళాదుంపలు, టొమాటోలు, సోయాబీన్స్, ఉల్లిపాయలు, నువ్వులు వంటి కూరగాయలను గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే వీటిలో గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచే విటమిన్లు, ఫైబర్ కంటెంట్, ముఖ్యమైన మూలకాలు ఉంటాయి.
చేపల కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇందుకోసం సార్డినెస్, ట్యూనా, సాల్మాన్, మాకేరెల్ వంటి చేపలను తరచుగా తినాలి.
mushroom
పుట్టగొడుగులు
ఈ పుట్టగొడుగుల్లో విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ను కూడా తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది.
గుండెకు మేలు చేసే విటమిన్ సి, విటమిన్ ఇ లు బొప్పాయి. క్యాప్సికమ్, ఆకుపచ్చ కూరగాయల్లో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే మీ గుండెకు ఎలాంటి ప్రమాదం వాటిళ్లదు.
ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. నిపుణుల అభిప్రాయం ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు నిద్రపోతేనే అతని గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే రిస్క్ లో పడుతుంది.
smoking
అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన అలవాట్లు కూడా గుండెను రిస్క్ లో పడేస్తాయి. అందుకే వీటికి తీసుకోవడం తగ్గించాలి. చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండే కేకులు, సోడాలు, పేస్ట్రీలు, బాటిల్ డ్రింక్ లు గుండెను ప్రమాదంలోకి నెట్టేస్తాయి. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా తగ్గించాలి. లేదంటే గుండె జబ్బులు, గుండెపోటు బారిన పడతారు.