Healthy Vegetables: ఈ కూరగాయలను తింటే ఎలాంటి రోగాలు రావు..!
Healthy Vegetables: విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటాం. ముఖ్యంగా ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మన శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచుతాయి. అలాగే ఎన్నో వ్యాధులను కూడా నివారిస్తాయి.

ప్రతిరోజూ మనం విటమిన్లు మరియు ప్రోటీన్లతో నిండిన కూరగాయలను (Vegetables) తీసుకోవాలి. అందులో ఆకుపచ్చని కూరగాయలను (Green vegetables) మన శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచుతాయి. ముఖ్యంగా ఏవి తిన్నా తినకపోయినా.. ఈ కూరగాయలను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయలు మీకెంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆకుపచ్చని కూరగాయలను మంచి ఆరోగ్యం కోసం ఖచ్చితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకుపచ్చని కూరగాయలు రక్త శాతాన్ని పెంచడమే కాకుండా, ఊబకాయాన్ని (Obesity) తగ్గించడానికి, పంటి క్యాన్సర్ (Tooth cancer), రక్తహీనత (Anemia), కిడీల్లో రాళ్లకు ఇవి దివ్యౌషధంగా కూడా పనిచేస్తాయి.
ఆకుపచ్చని కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థ (Immune system)ను బాగా చేస్తుంది. వీటితో పాటు మీ చర్మానికి, కళ్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి.
ఆకుపచ్చ కూరగాయల్లో మెంతికూర (Fenugreek), కాకరకాయ (Bitter Gourd ) మొదలైన కూరగాయలు కాస్త చేదుగా ఉంటాయి. అయితే అలాంటి కూరగాయల్లోనే కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. అవి ఎముకలు మరియు దంతాలకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. మీరు మీ దంతాలు, ఎముకలను బలంగా ఉంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ కూరగాయలను తినాలి. ఉడకబెట్టిన బచ్చలికూర తిన్నా లేదా పచ్చిగా నమిలినా దంతాలలో పైరియా, నోటి దుర్వాసన (Bad breath)ను వదిలించుకోవచ్చు.
కొవ్వును తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది:
నేటి కాలంలో ఓవర్ వెయిట్ లో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు జిమ్ లో గంటల తరబడి చెమటలు చిందించే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇలాంటి వారు తాము తినే ఆహారంపై శ్రద్ధ పెట్టకపోతే.. ఏమాత్రం ఆరోగ్యంగా ఉండరు. అంతేకాదు ఎన్నో రకాల రోగాలు కూడా మిమ్మల్ని చుట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఊబకాయం నుంచి బయటపడటానికి మీరు ఖచ్చితంగా బచ్చలికూర, ఆవాలు, మెంతికూర, సోయా వంటి ఆకుపచ్చ కూరగాయలను మీ ఆహారంలో చేర్చాలి . ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు మరియు వనరులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి, అలాగే ఇవి శరీరంలోని చెడు కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతాయి.
క్యాన్సర్, మూత్రుపిండాల్లో రాళ్లకు తొలగించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది:
ప్రాణాంతకమైన క్యాన్సర్ ఈ రోజుల్లో ఒక సాధారణ రోగంగా మారింది. ఈ వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఆకుపచ్చ కూరగాయలను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుపచ్చ కూరగాయలలో కరిగే ఫైబర్, ఇనుము, ఖనిజాలు మరియు కాల్షియం ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే మూత్రపిండాలలో ఆమ్లం పేరుకుపోకుండా చేస్తాయి. ఆకుపచ్చ కూరగాయలు శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడతాయి. ఇవి మూత్రపిండాల్లో ఉండే రాళ్లను తొలగించడానికి సహాయపడతాయి. ఆకుపచ్చ కూరగాయలు కూడా కంటిచూపును మెరుగుపరుస్తాయి.