MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Laos Travel: మీరు ఎంత పేదవాళ్లు అయినా... ఇక్కడికి వెళితే కోటీశ్వరులు అవుతారు

Laos Travel: మీరు ఎంత పేదవాళ్లు అయినా... ఇక్కడికి వెళితే కోటీశ్వరులు అవుతారు

Laos Travel: విదేశీ యాత్ర అనగానే లక్షలు ఖర్చవుతాయనుకుంటారు. కానీ, ఆ రోజులు పోయాయి. ఇండియా నుంచి కేవలం 9 గంటల్లో చేరుకోగల ఈ దేశంలో చాలా తక్కువ బడ్జెట్‌లో రాయల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఈ దేశం ప్రత్యేకతలేంటో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Mar 10 2026, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అందుబాటులో ఉన్న ధర
Image Credit : our own

అందుబాటులో ఉన్న ధర

విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారా? బడ్జెట్ గురించి టెన్షన్ పడుతున్నారా? అయితే మీకోసమే ఈ దేశం. ఆగ్నేయాసియాలోని 'లావోస్' (Laos) ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాల్లో ఒకటిగా పేరు పొందింది. ఇక్కడి ప్రకృతి అందాలు, తక్కువ ధరలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి.
27
బడ్జెట్ ఫ్రెండ్లీ
Image Credit : Getty

బడ్జెట్ ఫ్రెండ్లీ

2025-2026 నాటి తాజా లెక్కల ప్రకారం, లావోస్ టూరిస్టులకు చాలా తక్కువ ఖర్చుతో లగ్జరీ అనుభవాన్ని అందిస్తోంది. ఇక్కడ వసతి, ఆహారం, రవాణా ఖర్చులు మన ఇండియా కంటే కూడా తక్కువని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Visa Free Travel: పాస్ పోర్టు ఉంటే చాలు వీసా లేకుండా మనం ఇప్పుడు 56 దేశాలు తిరగేయచ్చు
Related image2
Travel Guide : తెల్లని ఇసుక, రంగురంగుల పగడపు దిబ్బలు.. ఆసియాలోనే అందమైన బీచ్ మన దక్షిణాదిదే.. ఈ ప్రాంతం భూతల స్వర్గమే
37
దీని విలువ తక్కువ
Image Credit : Getty

దీని విలువ తక్కువ

లావోస్ కరెన్సీని 'లావో కిప్' (Lao Kip) అంటారు. మన భారత రూపాయి‌తో పోలిస్తే దీని విలువ చాలా తక్కువ. మన దేశానికి చెందిన ₹4 నుంచి రూ.5 ఇస్తే, అక్కడ 1000 కిప్‌లు వస్తాయి. అంటే, మీ జేబులో కొన్ని వేల రూపాయలున్నా అక్కడ మీరు లక్షాధికారిలా ఖర్చు చేయొచ్చు. అందుకే భారతీయులు అక్కడికి వెళ్తే లక్షాధికారుల్లా బతకొచ్చు!

47
ప్రయాణ ఖర్చు ఎంత?
Image Credit : Getty

ప్రయాణ ఖర్చు ఎంత?

ఇటీవల ఓ ట్రావెల్ వ్లాగర్ షేర్ చేసిన సమాచారం ప్రకారం, లావోస్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్ ధరలు ఇలా ఉన్నాయి.. జలపాతం సందర్శనకు- ₹200. జిప్‌లైనింగ్-₹1,000. పారామోటరింగ్-₹3,000. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్:-₹5,000. వాహనం అద్దె-రోజుకు కేవలం ₹300కే స్కూటర్ అద్దెకు దొరుకుతుంది. రైలు ప్రయాణం-ంొంొదేశమంతా తిరగడానికి ₹1,000 చాలు.

57
భారత్ నుంచి ఎంత దూరం
Image Credit : Asianet News

భారత్ నుంచి ఎంత దూరం

భారత్ నుంచి లావోస్‌కు విమాన ప్రయాణ దూరం సుమారు 2,400 నుంచి 2,700 కిలోమీటర్లు. న్యూఢిల్లీ నుంచి ఆ దేశ రాజధాని వియంటియాన్ (Vientiane) చేరుకోవడానికి దాదాపు 9 నుంచి 11 గంటల సమయం పడుతుంది. చాలా విమానాలు బ్యాంకాక్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్‌గా ఉంటాయి.
67
లావోస్ ప్రత్యేకతలు
Image Credit : our own

లావోస్ ప్రత్యేకతలు

ఇది చైనా, వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల మధ్య ఉన్న భూపరివేష్టిత (Landlocked) దేశం.  ప్రసిద్ధ మెకాంగ్ నది ఈ దేశానికి జీవనాడిలాంటిది.

77
బౌద్ధమతాన్ని అనుసరిస్తారు
Image Credit : Asianet News

బౌద్ధమతాన్ని అనుసరిస్తారు

ఇక్కడి ప్రజలు ఎక్కువమంది బౌద్ధమతాన్ని పాటిస్తారు. అందమైన బౌద్ధ దేవాలయాలు, పచ్చని పర్వతాలు, అద్భుతమైన జలపాతాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఈ దేశం 1893 నుంచి 1953 వరకు ఫ్రెంచ్ కాలనీగా ఉండేది. ఆ ప్రభావం ఇప్పటికీ అక్కడి ఆర్కిటెక్చర్‌లో కనిపిస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ప్రయాణం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Summer Tips: ఎండాకాలంలో ఇంట్లో చల్లగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు!
Recommended image2
Sharara Suits: చిన్నారుల కోసం అందమైన షరార సూట్స్.. ఇవిగో
Recommended image3
RO Water: ఫిల్టర్ నీళ్లు తాగితే కిడ్నీలు పాడ‌వుతాయా.?
Related Stories
Recommended image1
Visa Free Travel: పాస్ పోర్టు ఉంటే చాలు వీసా లేకుండా మనం ఇప్పుడు 56 దేశాలు తిరగేయచ్చు
Recommended image2
Travel Guide : తెల్లని ఇసుక, రంగురంగుల పగడపు దిబ్బలు.. ఆసియాలోనే అందమైన బీచ్ మన దక్షిణాదిదే.. ఈ ప్రాంతం భూతల స్వర్గమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved