MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Soap Hacks: మిగిలిపోయిన సబ్బు ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా?

Soap Hacks: మిగిలిపోయిన సబ్బు ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా?

Soap Hacks: సబ్బు వాడాక చివరికి చిన్న ముక్కగా అయిపోతుంది. అప్పుడు వాటిని పడేస్తూ ఉంటాము. కానీ అలాంటి సబ్బు ముక్కలను ఒక చోట దాచి వాటన్నింటినీ ఇంట్లో అనేక రకాలుగా వాడుకోవచ్చు.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 10 2026, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మిగిలిపోయిన సబ్బు ముక్కలు
Image Credit : Getty

మిగిలిపోయిన సబ్బు ముక్కలు

సబ్బు వాడాక చివరలో చిన్న ముక్కలుగా మారి మిగిలిపోవడం సహజం. అలాంటి వాటిని ఎంతో మంది పారేస్తూ ఉంటారు. ఇలాంటి సబ్బు ముక్కలను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. వీటితో ఇంటిని మెరిపించవచ్చు. సబ్బు ముక్కలను ఒక డబ్బాలో వేసి దాచి ఉంచండి. వాటిని అవసరం అయినప్పుడల్లా వాడవచ్చు. ఎలా వాడాలో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దుస్తుల కోసం
Image Credit : Getty

దుస్తుల కోసం

వర్షాకాలం, చలికాలంలో బీరువాలోని పెట్టిన దుస్తుల నుంచి ఒక రకమైన ముక్కి వాసన వస్తుంది. గాలి, వేడి లేకపోవడం వల్ల కలిగే వాసన అది. మార్కెట్లో దొరికే స్ప్రేలు వాడడం కన్నా మిగిలిపోయిన సబ్బు ముక్కలను ఆ వాసన పొగొట్టేందుకు వాడొచ్చు. ఓ మస్లిన్ క్లాత్‌లో పొడి సబ్బు ముక్కను చుట్టి వార్డ్‌రోబ్‌లో లేదా షూ ర్యాక్‌లో పెట్టండి. తేమ వాసన మాయమవుతుంది.

35
చాక్ పీస్ బదులు సబ్బు
Image Credit : Getty

చాక్ పీస్ బదులు సబ్బు

కుట్లు, అల్లికలు అలవాటు ఉన్నవాళ్లు సైజు కోసం గీతలు గీసేందుకు చాక్ పీస్‌ వాడతారు. వాటికి బదులు ఎండిపోయినా సబ్బు ముక్కను వాడొచ్చు. టైలర్లకు చాక్ పీస్ కన్నా సబ్బు ముక్కే ఉత్తమం. చాక్ పీస్ మరకలు త్వరగా వదలవు… కానీ సబ్బు గీతలు త్వరగా వదులుతాయి. 

45
మొక్కల కోసం
Image Credit : Getty

మొక్కల కోసం

మిగిలిపోయిన సబ్బు ముక్కలు అన్నింటినీ ఒక బాటిల్ వేసి ఉంచండి.  వాటిని మొక్కలకు కీటకనాశినిగా వాడొచ్చు. ఆ బాటిల్ లో నీటిని వేసి సబ్బు ముక్కలు కరగనివ్వాలి. ఆ నీటిని మొక్కలపై స్ప్రే చేయాలి. ఇది మంచి పెస్టిసైడ్‌గా పనిచేస్తుంది. కానీ సబ్బును తక్కువ మోతాదులోనే చల్లాలి. లేకుంటే మొక్కలకు ప్రమాదం.

కొన్నిసార్లు ఇంటి తలుపులు, కిటికీల నుంచి కీచుమని శబ్దం వస్తుంటుంది. ఈ శబ్దాన్ని ఆపేందుకు తలుపు లేదా కిటికీ అంచులను ఈ సబ్బు ముక్కతో రుద్దండి. ఆ శబ్దం రావడం ఆగిపోతుంది.

55
బ్యాగ్ జిప్‌కు సబ్బు ముక్క
Image Credit : Getty

బ్యాగ్ జిప్‌కు సబ్బు ముక్క

పాత జాకెట్లు, బ్యాగులు లేదా జీన్స్ ప్యాంట్ల జిప్‌లు సరిగ్గా పనిచేయనప్పుడు సబ్బు ముక్కను వాడవచ్చు. జిప్ పైన సబ్బు ముక్కతో నెమ్మదిగా రుద్దాలి. ఆ తర్వాత జిప్‌ను పైకి, కిందికి లాగాలి. ఇరుక్కుపోయిన జిప్ వెంటనే ఫ్రీ అవుతుంది. సబ్బు అద్భుతమైన లూబ్రికెంట్‌లా పనిచేస్తుంది.

షూస్, సాక్సుల నుంచి దుర్వాసన వస్తున్నా కూడా సబ్బు ముక్కలను వాడవచ్చు.  రాత్రిపూట షూ లేదా సాక్సుల లోపల ఒక సబ్బు ముక్కను ఉంచండి. ఉదయాన్నే దాన్ని తీసేయండి. సాక్సుల నుంచి వచ్చే పాడు వాసన చాలా వరకు తగ్గుతుంది.

మిగిలిపోయిన సబ్బు ముక్కలను మీరు బాత్రూమ్ ఫ్రెష్‌నర్‌గా వాడుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో లేదా నెట్ బ్యాగ్‌లో సబ్బు ముక్కను వేసి బాత్రూంలో ఒక మూలన పెట్టండి. బాత్రూంలోని తేమకు సబ్బు నుంచి సువాసన వస్తుంది. దీంతో బాత్రూమ్ తాజాగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kova Sweet: పాలు కాచే పనిలేకుండా మిల్క్ పౌడర్‌తో ఈజీగా కోవాలు చేసేయండిలా
Recommended image2
Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్
Recommended image3
ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ రోజూ వేశారంటే వారంలో ముఖానికి మెరుపు ఖాయం
Related Stories
Recommended image1
Milk Spoilage: వేసవిలో పాలు విరిగిపోకుండా ఈ చిన్న చిట్కాలు ఉపయోగపడతాయి
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు IAS, IPS వంటి పెద్ద ప్రభుత్వోద్యోగాలు సాధించే అవకాశం ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved