కిడ్నీ స్టోన్స్ తగ్గాలంటే మందుబిల్లలే మింగక్కర్లే.. ఈ యోగాసనాలు వేసినా సరిపోతుంది..
కొన్ని యోగాసనాలతో మూత్రపిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ యోగాసనాలను క్రమం తప్పకుండా వేయడం వల్ల మీ శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది.

వయసు పెరిగే కొద్దీ లేనిపోని రోగాలు చుట్టుకుంటాయి. ఒత్తిడి, మధుమేహం, గుండెజబ్బులు రావడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. వీటికి తోడు మూత్రపిండాల సమస్యలను ఫేస్ చేస్తున్నవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇందులో కిడ్నీస్టోన్స్ తో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. కిడ్నీ స్టోన్స్ వల్ల విపరీతమైన నొప్పి పుడుతుంది. అందుకే వీటిని కరిగించుకోవడానికి చాలా మంది ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు. అయితే కొన్ని యోగా భంగిమలు కూడా కిడ్నీ స్టోన్స్ ను కరిగిస్తాయి. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Ustrasana
మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి Ustrasana ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ ఆసనం కడుపులోని అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలకు రక్త ప్రసరణ మెరుగ్గా అయ్యేందుకు సహాయపడుతుంది. మొత్తంగా ఇది కిడ్నీల్లో రాళ్లను సులువుగా తొలగించేందుకు సహాయపడుతుంది.
Uttanapadasana
ఉత్తనపాదాసనం కూడా కిడ్నీల్లో రాళ్లను కరిగిస్తుంది. ఇది కటి ప్రాంతాలను బలోపేతం చేస్తుంది. ఈ యోగాసనం చేయడం వల్ల క్లోమం, మూత్రపిండాలు, కాలేయాల పనితీరు మెరుగుపడుతుంది. మీకు మూత్రపిండాల్లో రాళ్లుంటే ఈ ఆసనాన్ని తప్పకుండా వేయండి. ఈ సమస్య నుంచి తొందరగా బయటపడతారు.
Pawanmuktasana
ఈ ఆసనం కూడా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ ఆసనం ఉదర ప్రాంతంలోని కండరాలను బలంగా చేస్తుంది. వెన్నుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
bhujangasana
భుజంగాసనం
భుజంగాసనం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లకు సమర్థవంతమైన కరిగించేందుకు ఈ యోగాసనం సహాయపడుతుంది. ఇది వెనుక భాగంలోని కండరాలను బలోపేతం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. భుజంగాసనం పొత్తికడుపు కండరాలను కుదించి, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ధనురాసనం
క్రమం తప్పకుండా ధనురాసనం చేయడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు తొందరగా కరిగిపోతాయి. ఈ ఆసనం వల్ల మూత్రపిండాలకు రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఈ ఆసనం కిడ్నీ స్టోన్స్ వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది.