MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వైట్ లేదా పింక్ ఏ జామకాయ ఆరోగ్యానికి మంచిది?

వైట్ లేదా పింక్ ఏ జామకాయ ఆరోగ్యానికి మంచిది?

జామకాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. అయితే కొన్ని జామకాయ గుజ్జు తెలుపు రంగులో ఉంటే మరికొన్ని జామ కాయల గుజ్జు పింగ్ కలర్ లో ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 22 2022, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనం ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ ఫ్రూట్స్ ను తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అందులో ప్రతి ఒక్క పండూ దాని సొంత ప్రరయోజనాలను కలిగి ఉంటుంది. అలాంటి పండ్లలో జామపండు ఒకటి. అయితే ఈ జామ పండ్లు కొన్ని తెల్ల కలర్ లో.. మరికొన్ని పింక్ కలర్ లో ఉంటాయి. ఇక వీటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తుందో.. తెలుసుకోవడానికి చాలా మంది కన్ఫూజ్ కు గురవుతుంటారు.  డైటీషియన్ శిఖా కుమారి దీని గురించి పూర్తిగా వివరించింది. తెలుపు, పింక్ జామకాయల మధ్య తేడాలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో తెలియజేసింది. 
 

25
guava

guava

తెల్ల జామకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఇది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ జామకాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదుు రుతుస్రావం నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ జామపండు యాంటీ క్యాన్సర్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.  ఈ తెలుపు జామకాయ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. తెలుపు జామకాయలో ఇనుము, కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఈ తెలుపు జామకాయలు డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచివి. 

35
guava

guava

పింక్ జామకాయల ఆరోగ్య ప్రయోజనాలు

పింక్ జామకాయలో కెరోటినాయిడ్లు అని పిలువబడే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది క్యారెట్లు, టమోటాలకు వాటి విలక్షణమైన ఎరుపు రంగును ఇస్తుంది. పింక్ జామకాయలను 'సూపర్ ఫ్రూట్స్' అని కూడా అంటారు. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఒమేగా 3, ఒమేగా 6 పాలీ అన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
 

45

ఏ రంగు జామకాయను తింటే మంచిది? 

పింక్ జామకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే తక్కువ చక్కెర, తక్కువ పిండి పదార్థం ఉంటుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. గింజలు కూడా తక్కువగా ఉంటాయి. అదే తెల్లజామకాయలో అయితే షుగర్ కంటెంట్, పిండి పదార్ధం, విటమిన్ సి తో పాటుగా గింజలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తెల్ల గుజ్జు జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతుంటే మాత్రం పింక్ జామకాయలను తినడం మంచిది కాదు. 
 

55

జామకాయను కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

చిన్న, మిడీయం సైజులో ఉండే జామకాయలనే కొనడం మంచిది. ఇలా ఉన్నప్పుడే మీరు జామకాయలను ఒకేసారి ఫినిష్ చేస్తారు. మచ్చలుండే జామకాయలను తింటే అవి త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిని కొనకపోవడే మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Ugadi 2026: ఉగాది రోజు ధరించాల్సిన రంగులు ఏంటీ? జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తోంది?
Recommended image2
Curly Hair: సాక్సులతో సింపుల్ గా హెయిర్ కర్ల్స్ ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Weight Loss: ఈ సూప్ తాగితే.. నెలరోజుల్లో బరువు తగ్గడం చాలా ఈజీ..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved