Stomach Hurt : కడుపులో మంట తగ్గాలంటే ఇలా చేయండి..
Stomach Hurt : మధ్యపానం, ధూమపానం అలవాట్లు, మానసిక ఒత్తిడి, అనేక రోగాలకు వాడుతున్న మెడిసిన్స్ వల్ల కడుపులో మంట వస్తుంటుంది. ఈ మంటను తగ్గించేందుకు కొన్ని చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..

Stomach Hurt : ఈ మధ్యకాలంలో ఛాతి మంటతో పాటుగా కడుపు మంటతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. మనం తీసుకున్న ఆహారంలో జీర్ణం అవడానికి కొన్ని రకాల ఆమ్లాలు, రసాలు రిలీజ్ అవుతుంటాయి. అలాంటి సమయంలో కూడా ఈ సమస్య వస్తుంటుంది.
మరికొన్ని సందర్భాల్లో అయితే నోట్లో పుల్లటి నీళ్లు ఊరుతూ గుండెల్లో మంట పడుతుంది. ఈ ఎసిడిటీ సమస్య ఉన్నవారు వాళ్లు తీసుకునే ఆహారం పట్ల తగిన జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తింటూ ఉండాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఈ కడుపు నొప్పి మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, పిత్తం ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ ఎసిడిటీ సమస్యను ఫేస్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. అలాగే వివిధ రోగాలకు వాడే మందుల మూలంగా కూడా ఇలా జరుగుతుందట.
వీటితో పాటుగా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా అలవాటు ఉన్నవారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. అలాగే కారం, పులుపు, మసాలలను ఎక్కువగా తీసుకున్నా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ఇలాంటి ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
ముఖంగా ఆయిలీ ఫుడ్స్, ఫ్రైలు, మాంసాహారం ఎక్కువగా తీసుకోకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు ప్రతిరోజూ ఒక సమయం ప్రకారమే తింటూ ఉండాలి.
ఎండుద్రాక్ష, యాపిల్ పండు, జీలకర్ర, మజ్జిగ, పుదీనా , పెరుగు వంటి వాటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కడుపు నొప్పి సమస్య ఉన్నవారు ఏదైనా ఆహారాన్ని ఒకే సారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కడుపుల మంట తగ్గాలంటే ఇలా చేయండి..
కడుపు మంట తగ్గడానికి బీట్ రూట్ రసం ఎంతో సహాయపడుతుంది. ఈ సమస్య ఉన్నవారు ప్రతతిరోజూ ఉదయం పూట ఒక కప్పు బీట్ రూట్ రసం తాగితే మంచి ఉపశమనం పొందుతారు.
అలాగే కొబ్బరి నీళ్లు కూడా ఈ కడుపునొప్పి సమస్యకు ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటుగా లేత కొబ్బరిని తిన్నా ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది.
ఎసిడిటీ సమస్య నుంచి తక్షణం ఉపశమనం పొందాలంటే జీలకర్ర కూడా బాగా సహాయపడుతుంది. జీలకర్ర నీటిని గోరువెచ్చగా చేసి అందులో చిన్న బెల్లం ముక్కను వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
తిన్నవెంటనే అరచెంచా సోంపు గింజలను నమిలినా కడుపునొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ సమస్య ఎంతకూ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం బెటర్.