MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ప్రెగ్నెన్సీ టైంలో గుడ్లను తినొచ్చా?

ప్రెగ్నెన్సీ టైంలో గుడ్లను తినొచ్చా?

ప్రెగ్నెన్సీ సమయంలో గుడ్లను తినొద్దంటే.. ఇంకొంతమంది మాత్రం ఈ సమయంలో గుడ్లను అస్సలు తినకూడదని అంటుంటారు. దీనిపై డాక్టర్లు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 12 2022, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డెలివరీ తర్వాత కంటే డెలివరీకి ముందు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఏ తప్పు చేసినా.. అది గర్భంలోని పిండానికి ప్రమాదం కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు రకరకాల రుచులను చూడాలన్న కోరికలు పుడుతుంటాయి. కానీ వీళ్లు ఎక్కువగా తినలేరు. అయితే వీళ్లు తినే ఆహారం కూడా గర్భిణీస్త్రీలపై ప్రభావం చూపుతుంది. అది మంచిదైనా.. చెడైనా.. మహిళలు తప్పనిసరిగా తినవలసిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. అలాగే కొన్ని తినకూడని ఆహారాలు కూడా ఉన్నాయి. అయితే గర్భిణులు గుడ్లను తినకూడదని కిందరంటే తినాలని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో డాక్టర్లు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

గుడ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అందుకే శాఖాహారులు గుడ్లను రోజూ తినాలని డార్టర్లు సలహానిస్తుంటారు. నిజానికి ప్రెన్నెన్సీ సమయంలో గుడ్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్లలో ప్రోటీన్లతో పాటుగా, విటమిన్ బి 12, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, రాగి, మెగ్నీషియం, సెలీనియం వంటి ఎన్నో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు గుడ్లును ఎంచక్కా తినొచ్చు. అయితే వీటిని తినేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. 
 

36

పచ్చి గుడ్లు తినొద్దు

గర్భిణీ స్త్రీలు పచ్చి గుడ్లను అసలే తినకూడదు. అందుకే గర్భిణులు గుడ్లను వండి వేరే ఆహారంలో చేర్చి తినొచ్చు. ఎందుకంటే ముడి గుడ్లను తింటే గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ముడి గుడ్లతో పాటు, గర్భిణీ స్త్రీలు చెడిపోయిన గుడ్లను కూడా తినకూడదు. ఇది గర్భధారణ సమయంలో సంక్రమణ అవకాశాలను పెంచుతుంది.
 

46

బయట గుడ్లను తినొద్దు

ఇంటి బయట ఉడకబెట్టిన లేదా గుడ్డు కూరను అసలే తినకూడదు. ఎందుకంటే చాలా చోట్ల గుడ్లను సరిగ్గా ఉడికించరు. ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇది పిల్లల ఎదుగుదలను దెబ్బతీస్తుంది. అందుకే ఇంట్లో వండిన గుడ్లను మాత్రమే తినండి. 

56

ఈ సమయంలో గుడ్లు తినండి

ప్రెగ్నెన్సీ సమయంలో గుడ్లను తినాలనిపిస్తే.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తినాలి. ఉదయం పూట మెటబాలిజం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తినడం వల్ల అజీర్థి సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది. ఉదయం గుడ్లను తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. 
 

66

ఎక్కువ గుడ్లను తినొద్దు

కొంతమంది గుడ్లను మరీ ఎక్కువగా తింటుంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో గుడ్లను మోతాదుకు మించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. గుడ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనేది నిజమే. కానీ మోతాదుకు మించి తినకూడదు. రోజుకు రెండు నుంచి మూడు గుడ్లను తినొచ్చు. కానీ వీటికంటే ఎక్కువ గుడ్లను తినడం ప్రమాదకరం. దీని వల్ల గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Girls Sandals: రూ.250లో ప్రతి డ్రెస్‌ మీదకి సూటయ్యేలా చెప్పులు
Recommended image2
Saree Tips: చీరలో లావుగా కనిపిస్తున్నారా? ఇదొక్క ట్రిక్ తో సన్నగా కనిపిస్తారు, పొట్ట కూడా కనిపించదు
Recommended image3
Hotel Hygiene: హోటల్ రూంలో ఇవి అస్సలు వాడొద్దు...ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved