MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • అరికాళ్లలో చెమట పడుతోందా? అయితే మీకు ఈ రోగాలు ఉండొచ్చు చెక్ చేసుకోండి..

అరికాళ్లలో చెమట పడుతోందా? అయితే మీకు ఈ రోగాలు ఉండొచ్చు చెక్ చేసుకోండి..

కొన్ని ప్రమాదకరమైన రోగాలకు మన శరీరం కొన్ని సంకేతాలను తెలియజేస్తుంది. వీటిని తేలిగ్గా తీసిపారేస్తే ప్రాణాల మీదికే రావొచ్చు. ఇలాంటి వాటిలో అరికాళ్లలో చెమట పట్టడం ఒకటి 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 14 2022, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎండకాలంలో చెమటపట్టడం చాలా కామన్. కాలాలతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి పాదాల్లో చెమట పట్టడం ప్రమాదకరమైన రోగాలకు సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాల మీదికి రావొచ్చంటున్నారు నిపుణులు. అసలు అరికాళ్లలో చెమట ఏయే వ్యాధులకు సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26
diabetes

diabetes

మధుమేహం

పాదాలలో చెమట పట్టడం డయాబెటీస్ లక్షణం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే పాదాల్లో చెమటపడుతుంది. మీరు ఏదైనా ఆహారం తిన్నవెంటనే అరికాళ్లలల్లో చెమట పడితే.. అది మధుమేహం వల్లేనని అర్థం చేసుకోండి. ఇందుకోసం టెస్ట్ చేయించుకోవడం మంచిది. 

36
heart attack

heart attack

గుండె సమస్యలు

గుండెకు సంబంధించిన సమస్యల వల్ల కూడా ఇలా అరికాళ్లలో చెమటలు పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కంగారు వల్ల అరికాళ్లలో చెమట పట్టడం, చెమట వల్ల అరికాళ్లు చలబడటం గుండె సంబంధించిన సమస్యలకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈ లక్షణాలు హార్ట్ ఎటాక్ కు ముందు కనిస్తాయి.  చెమట పట్టడంతో పాటుగా ఛాతిలో నొప్పి ఉంటే అది ఖచ్చితంగా గుండెకు సంబంధించిన సమస్యకు కారణమని గుర్తించండి. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 
 

46

రుతువిరతి

ఆడవారిలో రుతుస్రావం ఆగిపోవడాన్ని రుతువిరతి అంటారు. అయితే ఈ రుతువిరతికి ముందు కూడా అరికాళ్లలో చెమటపడుతుంది. ఇది రుతువిరతికి సంకేతం. 40 ఏండ్లు దాటిన ఆడవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే రుతువిరతి అని అర్థం చేసుకోండి. 
 

56

థైరాయిడ్

థైరాయిడ్ సమస్య వస్తే మన శరీరంలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి అరికాళ్లలో చెమట పట్టడం. థైరాయిడ్ డేంజర్ వ్యాధి. దీనిని వీలైనంత తొందరగా గుర్తించాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఈ లక్షణం కనిపించినప్పుడు థైరాయిడ్ టెస్ట్ ను తప్పకుండా చేయించుకోండి. 

66

ఇతర వ్యాధులు

అరికాళ్లలో చెమటలు పట్టడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. సంక్రామ్యత వల్ల కూడా అరికాళ్లలో చెమట పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా  ఇలా అవుతుంది. మెడిసిన్స్ ను ఎక్కువగా వేసుకోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, స్ట్రోక్ వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Trendy Bangles: అదిరిపోయే డిజైన్‍లో లక్క గాజులు.. ట్రై చేయకపోతే ఎలా?
Recommended image2
Crocs Health Risks: పిల్లలు వేసుకునే ఈ చెప్పుల్లో విషం..బయటపడ్డ అసలు నిజం!
Recommended image3
Blouse Designs: సమ్మర్ పార్టీల కోసం అదిరిపోయే డిజైన్‍లో బ్లౌజ్‍లు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved