MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు ఈ సమస్యలు రావొచ్చు..

స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు ఈ సమస్యలు రావొచ్చు..

స్మార్ట్ ఫోన్ లకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. ఇది లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు. కానీ వీటిని అతిగా ఉపయోగించడం వల్ల మెడనొప్పి, వేళ్ల నొప్పి, కంటి నొప్పి వంటి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 27 2022, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండేవారు చాలా తక్కువే.. పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల ను వాడటంలో తప్పేం లేదు. కానీ వీటికి బానిసగా మారితేనే లేనిపోని తిప్పలు వస్తాయి. అసలు స్మార్ట్ ఫోన్లు లేకుండా క్షణ కాలం కూడా ఉండని వారు ఉన్నారు. ఇలాంటి వారే ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటారు. స్మార్ట్ ఫోన్లకు బానిసలవ్వండం వల్ల మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ ఎప్పుడూ ఫోన్ తోనే గడపడం వల్ల మన శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా హాని కలిగిస్తుంది. రోజూ ఫోన్లను అతిగా ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

వేళ్ల నొప్పి

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు చాలా పెద్దవిగా ఉంటున్నాయి. రోజంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల చేతి వేళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి. అదే తగ్గిపోతుందిలే అని చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటుంటారు. కానీ దీని గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది వేలిని బలహీనపరుస్తుందని చెబుతున్నారు. 

ఎలా నివారించాలి: వేళిలో నొప్పి మొదట్లో  పెద్ద సమస్యను కలిగించనప్పటికీ.. భవిష్యత్తులో వేళ్ల బలం తగ్గి.. బిగ్గరగా అయిపోయే అవకాశం ఉంది. ఇందుకోసం ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలి. లేదంటే మీ వేళు ఒకేపొజీషన్ లో ఉంటుంది. వేళును కదల్చలేకపోతారు.చేతులను మసాజ్ చేసి, వాటిని సాగదీయండి. 

36

మెడనొప్పి

ఫోన్ ను ఎప్పుడూ చూడటం వల్ల మెడ నొప్పి వస్తుంది. అంతేకాదు అలాగే కిందికి వంగిపోయే అవకాశం ఉంది. ఫోన్ ను ఎక్కువగా చూడటం వల్ల మెడపై చాలా ఒత్తిడి పడుతుంది. అంతేకాదు ఫోన్ చూడటం వల్ల మెడ, భుజాలలో నొప్పి వస్తుంది. 

ఎలా నివారించాలి: ఈ నొప్పిని నివారించడానికి ఫోన్ ను మీ కళ్లకు దూరంగా ఉంచాలి.
 

46

వెన్నునొప్పి

18 నుంచి 24 సంవత్సరాల వయస్సున్న యువతలో 84 శాతం మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. 

దీనిని ఎలా నివారించాలి: దీనిని నివారించడానికి ఏకైక మార్గం నిటారుగా నడవడానికి, కూర్చోవడానికి ప్రయత్నించండి. 
 

56

డ్రై ఐస్

రోజంతా మొబైల్ ఫోన్ ను చూడటం, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లో ఎక్కువ సేపు పనిచేయడం, టీవీని గంటల కొద్దీ చూడటం వల్ల మన కళ్లపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కళ్లు బలహీనంగా మారతాయి. అలాగే కళ్లు పొడిబారుతాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగిస్తున్నప్పుడు.. కనురెప్పలను బ్లింక్ చేయడం మర్చిపోతాం. దీనివల్ల కళ్లు పొడిబారుతాయి. పొడిబారడం వల్ల అంటువ్యాధులు, ఇతర సమస్యలు కూడా వస్తాయి.

ఎలా నివారించాలి: దీనికోసం పని మధ్యలో ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లపాటు మీ కళ్ళను రిలాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే గాడ్జెట్లను దూరంగా ఉంచండి. అలాగే మీ కళ్లను ఆర్పడం మర్చిపోకూడదు. మొబైల్ లేదా ల్యాప్ టాప్ బ్రైట్ నెస్ ను తగ్గించి ఉపయోగించడం మంచిది. 
 

66
mobile phone

mobile phone

మోచేతిలో నొప్పి

స్మార్ట్ ఫోన్ ను చేతిలో గంటల తరబడి పట్టుకోవడం వల్ల మీ చేతులు ఎక్కువ సేపు వంగే ఉంటాయి. ఇది మోచేయి నొప్పికి దారితీస్తుంది. మీ మోచేయిలో మీకు తరచుగా నొప్పి లేదా జలదరింపు ఉన్నట్టైతే.. మీ ఫోన్ వల్లేనని అర్థం చేసుకోండి. 

దీనిని ఎలా నివారించాలి: దీని కోసం ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. అలాగే ప్రతిరోజూ చేతులకు స్ట్రెచింగ్ ఎక్సర్ సైజులు చేయండి. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
White Dress: వేసవిలో ఈ వైట్ డ్రెస్సులు ఆఫీసులకు అందంగా ఉంటాయి
Recommended image2
Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు అంత ఫాస్ట్ గా ఎలా పెరుగుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved