MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఉదయాన్నే పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

ఉదయాన్నే పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

నిజానికి ఉదయాన్నే రంగురంగుల పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ అందరికీ కాదు. వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి తినాలా? వద్దా? అనేది డిసైడ్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 21 2023, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పొద్దు పొద్దున్న పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసే ఉంటుంది. పండ్లను తినడం జీర్ణక్రియ, చర్మం, జుట్టు, జీవక్రియ, రోగనిరోధక శక్తికి మంచివని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పండ్ల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నా.. ప్రతి వ్యక్తికి ఒక నిర్దిష్ట శరీర రకం, జీవక్రియ ఉంటుంది. అందుకే కొంతమంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా పండ్లను తింటే.. ఇంకొంతమంది తినకుండా ఉండాలి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రతి పండులో ఎన్నో రకాల ఎంజైమ్లు, ఆమ్లాలు ఉంటాయి. ఇవి గట్ లోని బ్యాక్టీరియాతో ప్రతిస్పందించగలవు. వ్యక్తి లక్షణాలను బట్టి అవి మంచిచేయొచ్చు లేదా చెడు చేయొచ్చు. ముందుగా మీరు తినే పండ్లు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను, దుష్ప్రభావాలను కలిగిస్తాయో తెలుసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

37
fruits

fruits

నిపుణుల అభిప్రాయం ప్రకారరం.. అన్ని పండ్లలో క్రియాశీల ఎంజైమ్లు, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్, ఫ్యూమారిక్, ఆక్సాలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం వంటి పండ్ల ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పాల ఉత్పత్తులలోని లాక్టిక్ ఆమ్లంతో త్వరగా స్పందిస్తాయి. కూరగాయలు, ధాన్యాలు, మాంసంతో కలవవు. ఇవి జీర్ణం కాని జీవక్రియ వ్యర్థాలను పుట్టిస్తాయి. ఇలాంటి పండ్ల కలయికలు కణజాలం జీవక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే కణజాలం ఏర్పడే ప్రక్రియను నిరోధిస్తాయి. 

47

వీళ్లు పండ్లను తినకూడదు

జలుబు, దగ్గు, సైనసైటిస్, అలెర్జీలు, ఆస్తమా, గవత జ్వరం, ఊపిరితిత్తుల రద్దీ, బ్రాంకైటిస్, డయాబెటిస్, బరువు పెరగడం, ఎసిడిటీ, మంట లేదా కఫ సంబంధిత లక్షణాలు ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో పండ్లను తినకూడదు. 
 

57

వీళ్లు పండ్లను తినాలి

ఒకవేళ మీకు మలబద్ధకం, పొడి, గరుకైన చర్మం, పొడి జుట్టు, బలహీనమైన జీర్ణక్రియ, బలహీనమైన జీవక్రియ వంటి  సమస్యలను ఉంటే ఖచ్చితంగా ఉదయాన్నే పండ్లను తినండి. పండ్లు మీ గట్ బ్యాక్టీరియాను పెంచుతాయి. అలాగే మీ జీర్ణ రసాలను ప్రేరేపిస్తాయి. అయితే జీర్ణక్రియకు సహాయపడటానికి, మలబద్ధకాన్ని పోగొట్టడానికి మీరు ఉడకబెట్టిన పండ్లను అంటే నీరు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలతో ఉడకబెట్టినవి తినాలి.
 

67

గుర్తుంచుకోండి.. పండ్లను తినడం మంచిదే కానీ.. పండ్లను మాత్రమే తినాలి. పండ్లను కూరగాయలు, పాడి, ధాన్యాలు లేదా మాంసంతో కలపకూడదు. ఎందుకంటే ఇలా కలిపితే అది విషపూరితంగా మారుతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ పండ్ల నుంచి వచ్చినవే కాబట్టి వీటిని పండ్లను మిక్స్ చేసి తీసుకోవచ్చు. 
 

77

ఉదయాన్నే పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఉదయం అల్పాహారంలో పండ్లను తినేవారు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే.. 

ఉత్తమ డిటాక్స్ ఆహారాలు

మన శరీరం ఉదయం 7 - 11 గంటల నుండి డిటాక్స్ ప్రక్రియకు లోనవుతుంది. చాలా కొవ్వులను కలిగున్న యాంటీ డిటాక్స్ ఆహారాల మాదిరిగా కాకుండా పండ్లు ఈ ప్రక్రియకు శక్తినిస్తాయి. 

జీవక్రియ పెరుగుతుంది

పండ్లు అన్నింటికంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు. ఉదయాన్నే వీటిని తినడం వల్ల సహజసిద్ధమైన పండ్లలోని  చక్కెర జీవక్రియ రేటును పెంచేందుకు సహాయపడుతుంది. 

మీ శరీరం చురుకుగా ఉంటుంది

మీరు నిద్రలేచిన వెంటనే మీ శరీరానికి సహజ పండ్ల చక్కెరలు చాలా అవసరం. మీ మెదడును చురుకుగా, శక్తివంతంగా ఉంచే పండ్లను తీసుకోండి. దీనివల్ల మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Mint Growing: బయట కొనాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే పుదీనా ఈజీగా పెంచేయండి
Recommended image2
USA : అమెరికా వెళితే తప్పకుండా చూడాల్సిన టూరిస్ట్ స్పాట్స్ ఇవే
Recommended image3
Hotel: ప్రపంచంలో ఖరీదైన హోటల్..ఒక్క రాత్రి బిల్లుతో BMW కారు కొనేయచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved