Hotel: ప్రపంచంలో ఖరీదైన హోటల్..ఒక్క రాత్రి బిల్లుతో BMW కారు కొనేయచ్చు
life Jul 28 2026
Author: ramya Sridhar Image Credits:Our own
Telugu
ప్రపంచంలో కెల్లా ఖరీదైన హోటల్ ఇది..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ దుబాయిలో ఉంది. దీని పేరు అట్లాంటిస్ ది రాయల్.
Image credits: X Twitter
Telugu
ఒక్క రాత్రికి అద్దె ఎంతో తెలుసా?
అట్లాంటిస్ ది రాయల్ హోటల్‌లోని రాయల్ మ్యాన్షన్‌లో ఒక్క రాత్రి బస చేయాలంటే లక్ష అమెరికన్ డాలర్లు చెల్లించాలి. అంటే మన కరెన్సీలో సుమారు రూ.87 లక్షలు. ఈ ధరకి రెండు కార్లు కొనేయచ్చు.
Image credits: Instagram
Telugu
హోటల్ రూమ్‌లో ప్రత్యేకత ఏంటి?
ఈ హోటల్‌లోని రాయల్ మ్యాన్షన్‌లో 4 బెడ్‌రూమ్‌లతో కూడిన అద్భుతమైన పెంట్‌హౌస్ ఉంది. ఇది రెండు అంతస్తుల్లో ఉంటుంది. ఇందులో 100 ఏళ్ల నాటి ఆలివ్ చెట్టు ఉంది.
Image credits: Our own
Telugu
చూడటానికి చాలా అందంగా ఉంటుంది
రాయల్ మ్యాన్షన్ నుంచి అరేబియా సముద్రంలోని పామ్ ఐలాండ్, దుబాయ్ స్కైలైన్ అద్భుతంగా కనిపిస్తాయి. ఇంత అందమైన దృశ్యాన్ని మరెక్కడా చూడలేం.
Image credits: stockPhoto
Telugu
ఈ హోటల్‌ను ఎవరు నిర్మించారు?
ఈ హోటల్‌ను అమెరికన్ ఆర్కిటెక్ట్ కోన్ పెడెర్సెన్ ఫాక్స్ డిజైన్ చేశారు. దీనిని సుమారు 20.83 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 795 గదులు, 231 నివాస గృహాలు ఉన్నాయి.
Image credits: Asianet News
Telugu
అట్లాంటిస్ ది రాయల్‌లో ఏమేం ఉన్నాయి?
ఇక్కడ ప్రైవేట్ లాబీ, ఎస్కలేటర్, 90 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అతిథులు కావాలనుకుంటే 18, 19వ అంతస్తులను బుక్ చేసుకొని ఏకంగా 16 గదులను రిజర్వ్ చేసుకోవచ్చు.
Image credits: our own
Telugu
అట్లాంటిస్ ది రాయల్ హోటల్‌లోని గదులు
ఇక్కడ రెండు అంతస్తుల డ్యూప్లెక్స్ సూట్ ఉంది. ఇందులో 4 బెడ్‌రూమ్‌లను బుక్ చేసుకోవచ్చు. వీటిలో 3 కింగ్ సైజ్ బెడ్‌లు, 2 క్వీన్ సైజ్ బెడ్‌లు ఉంటాయి.