MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపితే ఏమౌతుందో తెలుసా?

మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపితే ఏమౌతుందో తెలుసా?

మామూలుగా ప్రయాణాలు చేసేటప్పుడు లేదా ఇంకొన్ని సందర్భాల్లో టాయిలెట్ కు వెళ్లకుండా మూత్రాన్ని నియంత్రిస్తారు. కానీ దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 11 2022, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మూత్ర విసర్జన అనేది ఒక సహజ ప్రక్రియ. కానీ బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు లేదా పబ్లిక్ టాయిలెట్లలో మూత్రానికి వెళ్ళడానికి చాలా మంది సిగ్గుపడుతుంటారు. కానీ మూత్రాన్ని ఎక్కువ సేపు పట్టి ఉంచడం కుదరదు. కానీ ఎక్కువ కాలం మూత్రాన్ని ఆపడం వల్ల 15 శాతం మందికి ప్రోస్టేట్, కిడ్నీల్లో రాళ్ళు, మూత్రపిండాల సమస్యలు, పైల్స్ వంటి సమస్యలు ఉన్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అసలు ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

చాలా మంది బలవంతంగా మూత్రాన్ని నియంత్రిస్తారు. కాని మూత్రంలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది మూత్రాశయంలో తీవ్రమైన సంక్రమణకు కారణమవుతుంది.

మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం సంచిలా కనిపిస్తుంది. అలాగే ఇది కిందికి జారిపోతుంది. దీనివల్ల మూత్రం పూర్తిగా విడుదల కాదు. కొన్నిసార్లైతే మూత్రాశయం కూడా పగిలిపోవచ్చు.  ఇది మాత్రమే కాదు మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపే వ్యక్తులు మూత్రం పోసేటప్పుడు నొప్పి కలుగుతుంది. 

35

మూత్రాశయంలో ఎక్కువ కాలం మూత్రం పేరుకుపోయినప్పుడు.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య కూడా పెరుగుతుంది. ఇది కణితి రూపంలో కూడా ఉండే అవకాశం ఉంది. 

మూత్రాశయం ఎక్కువ సేపు మూత్రంతో నిండి ఉంటే.. మూత్రాశయం బలహీనంగా మారుతుంది. అలాగే దాని బయటి పొర పలుచగా మారుతుంది.

గర్భిణులు మూత్రాన్ని ఆపడం కష్టమవుతుంది. దీనివల్ల మూత్రం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ మూత్రాశయంతో మూత్రం నిండితే గర్భంలో ఒత్తిడి పెరుగుతుంది. 
 

45

1 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ప్రతి గంటకు మూత్ర విసర్జన చేయాలి. ఎందుకంటే నవజాత శిశువులకు మూత్రాశయం చాలా చిన్నగా ఉంటుంది. ఈ కారణంగానే వాళ్లు త్వరగా మూత్ర విసర్జన చేస్తారు. అయితే కాలక్రమేణా పిల్లలు రోజుకు 10 నుంచి 12 సార్లు టాయిలెట్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇక పెద్దల విషయానికొస్తే.. వీల్లు రోజుకు 6 సార్లు మూత్ర విసర్జన చేయాలి. ఇందుకోసం రోజూ పుష్కలంగా నీటిని తీసుకోవాలి. 
 

55


మూత్రాశయం ఆరోగ్యంగా ఉండాలంటే.. 

1. మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి.. మూత్రాన్ని అస్సలు ఆపుకోకూడదు. ఎప్పటికప్పుడు మూత్ర విసర్జన చేయాలి. 

2. పుష్కలంగా నీటిని తాగాలి. దీంతో మూత్రం ద్వారా బ్యాక్టీరియా కూడా శరీరం నుంచి బయటకు పోతుంది. 

3. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయాలి. కటి వ్యాయామాలు చేస్తే కూడా మూత్రాశయం ఆరోగ్యంగా ఉంటుంది.

4. ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాల్ని పెంచుతాయి.

5. శృంగారంలో పాల్గొన్న తర్వాత మీ ప్రైవేట్ భాగాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.

6. టైట్ ఫిట్టింగ్ ప్యాంటును ధరించడం మానుకోండి. కాటన్ లోదుస్తులు మాత్రమే ధరించండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pearl nose pins: ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం
Recommended image2
Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!
Recommended image3
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved