- Home
- Life
- బొప్పాయి ఆకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను, మొటిమలను, మచ్చలను తగ్గించడమే కాదు.. మరెన్నో సమస్యలను పోగొడుతాయి..
బొప్పాయి ఆకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను, మొటిమలను, మచ్చలను తగ్గించడమే కాదు.. మరెన్నో సమస్యలను పోగొడుతాయి..
Health Tips: బొప్పాయి పండే కాదు దాని ఆకు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మంపై ఉండే మురికిని తొలగించి అందంగా మెరిసేలా చేస్తుంది.

బొప్పాయి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నసంగతి దాదాపుగా అందరికీ తెలుసు.. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అయితే బొప్పాయి పండు మాత్రమే కాదు దాని ఆకు కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బొప్పాయి ఆకు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
డెంగ్యూ జ్వరం లక్షణాలను తగ్గించడంలో బొప్పాయి ఆకులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. డెంగ్యూ సోకిన వారికి మొదటి దశలోనే చికిత్స చేయాలి. లేదంటే అతని పరిస్థితి విషమిస్తుంది. ఎందుకంటే డెంగ్యూ వల్ల ప్లేట్లెట్ల స్థాయిలు తగ్గుతాయి. అయితే బొప్పాయి ఆకులు రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి. అయినప్పటికీ ఇది డెంగ్యూను పూర్తిగా తగ్గించదు. కానీ లక్షణాలను మాత్రం తగ్గించగలదు..
మధుమేహులకు కూడా బొప్పాయి ఆకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలా అంటే బొప్పాయి ఆకులు వీరి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలవు. ఆకులో ఉండే సమ్మేళనాలే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
బొప్పాయి ఆకులు జీర్ణ సమస్యలను కూడా తగ్గించగలవు. మలబద్దకం, ఎసిడిటీ, పొత్తి కడుపు నొప్పితో బాధపడేవారు బొప్పాయి ఆకులను తింటే మంచిది. ఇది ఈ సమస్యలను పోగొడుతుంది. బొప్పాయి ఆకుల్లో మీ జీర్ణ సమస్యలను తగ్గించే పపైన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. దీనిలో ఉండే పీచుపదార్థం వల్ల కూడా ఈ సమస్యలు తగ్గుతాయి.
బొప్పాయి ఆకుల్లో వివిధ సమ్మేళనాలు చర్మాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయి ఆకులు చర్మ రంధ్రాల నుంచి మురికిని నూనెలను తొలగించడానికి సహాయపడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.
ఆక్సీకరణ ఒత్తిడి ఎక్కువైతే జుట్టు విపరీంగా రాలుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఇవి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. ఇవి జుట్టును రాలడాన్ని ఆపి ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. అయితే బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిటెండ్లు, ఫ్లేవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి హెయిర్ ఫాల్ ను ఆపుతాయి.
బొప్పాయి ఆకును క్రమం తప్పకుండా చర్మానికి ఉపయోగించడం వల్ల మృదువైన, యవ్వన చర్మం మీ సొంతమవుతుంది. ఈ బొప్పాయి ఆకుల్లో ఉండే కరిగే ఎంజైమ్ అయిన పపైన్ చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మ రంధ్రాల్లో ఉండే మురికిని, మొటిమలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.