చలికాలంలో ఎనర్జిటిక్ గా ఉండాలంటే వీటిని తినండి
చలికాలంలో ఒంట్లో శక్తి బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా సోమరితనంగా కూడా ఉంటుంది. మన శరీరంలో శక్తి ఉంటే ఇలాంటి సమస్యలొచ్చే అవకాశం తగ్గుతుంది తెలుసా.. మరి బాడీ శక్తివంతంగా ఉండటానికి ఎలాంటి ఆహారాలను తినాలంటే..
ఆరోగ్యకరమైన జీవనశైలి, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచే ఆహారాలను మీ రోజు వారి ఆహరంలో తప్పకుండా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పిండి పదార్థాలు, ప్రోటీన్ తో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వులను చలికాలంలో మరువకుండా తీసుకోవాలి. రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓట్స్
ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఓట్స్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఓట్స్ ను తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఓట్స్ మన శరీరానికి చాలా ఎనర్జీని ఇస్తాయి.
పెరుగు
పెరుగులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. పెరుగులో ప్రోటీన్లు, కాల్షియం, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గట్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
nuts
గింజలు, విత్తనాలు
గింజలు, విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు గింజలు, గింజలను కలిపి తినడం వల్ల మీ శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి. మీరు ఎనర్జీటిక్ గా ఉండాలంటే.. ప్రతి కొన్ని గంటలకు కొన్ని వేయించిన అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, బాదం, వేరుశెనగలను తినండి. వీటిలో సెలీనియం, మెగ్నీషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
అరటిపండ్లు
అరటి పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ తో సహా సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అరటి పండ్లను తిన్న వెంటనే ఫుల్ ఎనర్జీని ఫీల్ కలుగుతుంది. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
Sprouts
మొలకలు
మొలకల్లో ఉండే పోషకాలను శరీరం మరింత సులభంగా గ్రహిస్తుంది. వీటివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశమే ఉండదు. వీటిని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది కూడా. మొలకల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
క్వినోవా
క్వినోవాలో చాలా విటమిన్లు, ఖనిజాలు అలాగే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్ లో చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ మాత్రం తక్కువగా ఉంటుంది. అంటే వీటిలోని కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. అలాగే ఇవి మీకు ఎక్కువ సేపు శక్తిని ఇస్తాయి.