MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చలికాలంలో బెల్లాన్ని ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!

చలికాలంలో బెల్లాన్ని ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!

చలికాలంలో బెల్లాన్ని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.  బెల్లాన్ని ఎన్నో పద్దతుల్లో తినొచ్చు. హల్వా, లడ్డూలూ అంటూ బెల్లాన్ని వివిధ వంటకాల్లో వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 07 2023, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చక్కెరతో పోల్చితే బెల్లమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ చాలా మంది బెల్లం కంటే చక్కెరనే ఎక్కువగా తింటుంటారు. మీకు తెలుసా.. బెల్లం ఆరోగ్య ప్రయోజనాల భాండాగారం. దీనిలో ఐరన్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ప్రయోజనకరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కడుపులో గ్యాస్, చెడు శ్వాసను దూరం చేయడానికి సహాయపడుతుంది. బెల్లాన్ని నేరుగా తినేవారు చాలా మంది ఉన్నారు. కానీ మీ ఆహారంలో బెల్లం జోడించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
 

26

బెల్లం పాలు

రోజూ గ్లాస్ లేదా కప్పు పాలలో కొంత బెల్లాన్ని కలిపి తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. బెల్లం పాలు తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి లేదా తిమ్మిరి తగ్గుతాయి. మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్థి సమస్య ఉండదు. 
 

36
<p>jaggery</p>

<p>jaggery</p>

పప్పు

బెల్లాన్ని కేవలం తీపివంటకాల్లోనే కాదు.. కారం కూరల్లో కూడా వాడొచ్చు. రుచిని పెంచడానికి బెల్లాన్ని పప్పులో కూడా వేస్తారు. ఉప్పుతో పాటు రుచిని సమతుల్యం చేయడానికి ఆమ్చూర్, ఎర్ర మిరపకాయలను జోడించొచ్చు. దీనివల్ల ఆహారం ఎక్కువ తీయగా ఉండదు. బెల్లం మీ వంటకానికి అద్భుతమైన రుచిని, వాసనను ఇస్తుంది. శరీరంలో ఇనుమును బాగా గ్రహించడానికి దీనికి కొన్ని చుక్కల నిమ్మకాయను జోడించండి. రక్తహీనతతో బాధపడుతున్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

46

హల్వా

సాంప్రదాయ హల్వాలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించండి. ఇది మీ ఆహారంలో ఇనుమును పెంచుతుంది. అంతేకాదు ఇది హల్వాను ను మరింత రుచిగా చేస్తుంది. బంగాళాదుంప హల్వాను బెల్లంతో చేస్తే రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలలో కూడా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనికి మంచి మొత్తంలో నెయ్యి అవసరమవుతుంది. కానీ ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. బెల్లం హల్వాకు మీరు పిస్తా, బాదం, ఎండుద్రాక్ష వంటి రకరకాల  డ్రై ఫ్రూట్స్ జోడించవచ్చు.

56

బెల్లం నీరు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చూర్ణం చేసిన బెల్లం వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఆరోగ్యకరమైన ప్రేగు కదలికకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే దీనిని ఉదయం ఖాళీ కడుపున తాగండి. ఇది ఊపిరితిత్తులను, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

66

లడ్డూ

బెల్లాన్ని కొద్దిగా నెయ్యితో కరిగించి తర్వాత తెల్ల నువ్వులు నువ్వులు కలపండి. ఈ మిశ్రమాన్ని లడ్డూగా తయారు చేయండి. ఇది వేడిగా ఉంటే గట్టిగా మారే ప్రమాదం ఉంది. నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బెల్లం లడ్డూలు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇవి చాలా మంచివి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Dosas : మన పెసరట్టు... వరల్డ్ వైడ్ హిట్టు
Recommended image2
Travel Guide : మీ మానసిక స్థితి ఏంటి..? ఏ ట్రిప్ కు వెళ్లాలో తెలుసా..?
Recommended image3
Chaat Masala: ఈ ఒక్క పొడితో స్నాక్స్ కు నోరూరించే టేస్ట్, పిల్లలు అస్సలు వదలరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved