- Home
- Life
- జాగ్రత్త.. డైట్ ఫుడ్స్, డ్రింక్స్ తో బరువు పెరగడమే కాదు.. ఈ ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తాయి..
జాగ్రత్త.. డైట్ ఫుడ్స్, డ్రింక్స్ తో బరువు పెరగడమే కాదు.. ఈ ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తాయి..
ఈ రోజుల్లో డైట్ పేరుతో జీరో కేలరీల ఆహారాన్ని, డ్రింక్స్ ను తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుందని భావిస్తారు. నిజానికి దీనిలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. పైగా వీటిని వల్ల ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తాయట.

ఈ రోజుల్లో చాలా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. పైగా ఫిట్ నెస్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. వ్యాయామంతో పాటుగా, డైట్ ను కూడా పక్కాగా పాటిస్తున్నారు. ఇందుకోసం డైట్ ఫుడ్స్, డ్రింక్స్ నే తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాదు.. ఎన్నో రోగాలు తగ్గిపోతాయని భావిస్తున్నారు. కానీ ఇలాంటి ఆహార పదార్థాలు, పానీయాలు మిమ్మల్ని ఎన్నో జబ్బుల బారిన పడేస్తాయని బ్రిటన్ ఎపిడెమియాలజిస్ట్, సైన్స్ రచయిత టిమ్ స్పెక్టర్ తెలిపారు.
ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ తో జరిగిన సంభాషణలో.. ఆహారానికి సంబంధించిన విషయాల్లో ఎన్నో అపోహలు ఉన్నాయని ఆయన అన్నారు. డైట్ డ్రింక్స్ లో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్లు ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఆహార సంస్థలు వీటిని ఆరోగ్యకరమైనవని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిదని ఈయన చెప్పారు. కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి మంచివని తెలియజేశాడు. కానీ కృత్రిమ స్వీటెనర్ ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచిది కాదు.
డైట్ డ్రింక్స్ లో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్లు కూడా తక్కువ ఆరోగ్యకరమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జర్మన్ నేషనల్ కేన్సర్ సెంటర్ చేసిన ఒక అధ్యయన౦లె.. స్వీటెనర్లను తీసుకున్న పెద్దలు "గట్ సూక్ష్మజీవుల నిర్మాణ౦లో, పనితీరులో భిన్నమైన మార్పులను" కలిగివున్నారని వెల్లడించారు.
ఊబకాయాన్ని పెంచుతుంది
డైట్ డ్రింక్స్ లో కేలరీలు ఉండవు. కానీ వీటిలో ఉండే కృత్రిమ స్వీటెనర్లు ఊబకాయాన్ని పెంచుతాయి. దీనిని తాగడం వల్ల మీ నడుము చుట్టూ, శరీరమంత కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు.
టైప్ 2 డయాబెటిస్
Health.com ప్రకారం.. డైట్ సోడా తాగడం వల్ల మీకు డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ అభివృద్ధి చెందే ప్రమాదం 36% ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని వెల్లడైంది.
depression
డిప్రెషన్ ను పెంచుతుంది.
ఈ అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ డైట్ డ్రింక్స్ తీసుకునే వ్యక్తులు ఇతర వ్యక్తుల కంటే డిప్రెషన్ కు గురయ్యే అవకాశం 30 శాతం ఎక్కువగా ఉంటుందని తేలింది.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండొచ్చు
తీపి ఆహార పదార్థాలే కాదు తీపి పానీయాలను తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండే ఆహారం చికాకు సమస్యలను కలిగించే అవకాశం ఉంది. అలాగే క్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.