MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వేడి వేడి టీ మాత్రమే కాదు.. ఇవి కూడా మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా, రీఫ్రెష్ గా ఉంచుతాయి..

వేడి వేడి టీ మాత్రమే కాదు.. ఇవి కూడా మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా, రీఫ్రెష్ గా ఉంచుతాయి..

ఉదయం లేవగానే గ్లాస్ నీళ్లను తాగితే బాడీ హైడ్రేట్ అవుతుంది. దీంతో బద్దకం, మగత వదిలిపోతాయి. దీంతో మీరు రోజంతా తాజాగా, ఎనర్జీటిక్ గా ఉంటారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Oct 13 2022, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోయినా కొంతమంది ఉదయం నిద్రలేవగానే బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తారు. దీనికి కారణం శరీరంలో శక్తి లేకపోవడడం. శరీరానికి శక్తి అందాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పోషకాహారం తినాలి. అయితే  చాలా మంది వీటికి బదులుగా పరిగడుపున టీనో, కాఫీనో తాగుతుంటారు. నిజానికి టీ, కాఫీ ల వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పరిగడుపున టీ తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అలాగే ఎన్నో సమస్యలు కూడా వస్తాయి. మరి రోజంతా ఎనర్జిటిక్ గా, తాజాగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఉదయాన్నే పుష్కలంగా నీరు త్రాగాలి

ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. ఇందుకోసం లేవగానే గ్లాస్ లేదా రెండు మూడు గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి. రాత్రిపూట పడుకునే ముందు మంచం దగ్గరే వాటర్ బాటిల్ పెట్టుకుని ఉదయం లేవగానే పుష్కలంగా తాగండి. బాడీ డీహైడ్రేట్ అయితే కూడా ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తుంది. 

36

గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడి విత్తనాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం, రాగి, ప్రోటీ, జింక్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని హెల్తీ ఫుడ్ అంటారు. ఈ చిన్న గింజలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. దీనిలో ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకరకమైన అమైనో ఆమ్లం. ఇది సెరోటోనిన్ అని పిలువబడే మానసిక స్థితిని పెంచే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఉదయం ఒక చెంచా గుమ్మడి గింజలను తినండి. 
 

46

వాల్ నట్స్ 

మీరు రోజంతా ఎనర్జిటిక్ గా పనిచేయడానికి వాల్ నట్స్ మీ శరీరానికి ఇంధనం లాగా ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ బి6, థయామిన్, ఫోలిక్ యాసిడ్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయం పూట తినడం వల్ల మీ శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. వాల్ నట్స్ లో సోడియం, గ్లూటెన్, కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, జింక్, సెలీనియం, ప్రోటీన్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
 

56

ఖర్జూరం

ప్రతిరోజూ ఉదయం పూట కొన్ని ఖర్జూరాలను తినడం ఎంతో మంచిది. వీటిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, వ్యాధితో పోరాడే ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఖర్జూరాలు జీర్ణవ్యవస్థను వేగవంతం చేస్తాయి. ఇవి మీకు రీఫ్రెష్ అనుభూతిని కలిగిస్తాయి. 
 

66
cashew

cashew

జీడిపప్పు 

జీడిపప్పులో ఉండే పోషకాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. రాత్రంతా నానబెట్టిన కొన్ని బాదం పలుకులను ఉదయం పరిగడుపున తాగడం వల్ల బరువు తగ్గడం నుంచి ఎముకలు బలంగా మారుతాయి. ఇవి మీ మానసిక స్థితి మెరుగుపరుస్తాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గిస్తాయి. వీటిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి. జీడిపప్పు డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇవి రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ల మొత్తాన్ని కూడా పెంచుతుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Leaf Ring Design: అందమైన ఆకుల డిజైన్స్‌తో గోల్డ్ రింగ్స్
Recommended image2
IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
Recommended image3
Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved