ముద్దు పెట్టుకుంటే లైంగికంగా సంక్రమించే వ్యాధులు వస్తాయా?
ఎస్.టి.డి లనే లైంగికంగా సంక్రమించే వ్యాధులు అంటారు. అయితే ఈ వ్యాధులు ముద్దు పెట్టుకుంటే కూడా వస్తాయని కొంతమంది అంటున్నారు. మరి దానిలో నిజమెంతుందంటే..
ముద్దు మైమరిచిపోయే గొప్ప అనుభూతి. ఈ ముద్దు ఒకరిపై ఉన్న ప్రేమను, ఇష్టాన్ని చెబుతుంది. ఎదుటివాళ్లంటే ఎంత ఇష్టమో మాటలు రానప్పుడు చాలా మంది ముద్దు పెట్టుకుంటారు. ముద్దు చాలు వాళ్లంటే ఎంతో ప్రేమో తెలియజేయడానికి. ఇక ఈ ముద్దు ఇద్దరి మధ్యన సెక్స్ కు కూడా దారితీస్తుంది. సాధారణంగా ముద్దును బుగ్గపై, నుదిటిపై, పెదాలపై పెడుతుంటారు. ముద్దు ముచ్చట బాగానే ఉన్నా.. కొన్ని సార్లు ముద్దు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ ముద్దు లైంగికంగా సంక్రమించే వ్యాధులను కలిగిస్తుంది కాబ్టటి. లైంగికంగా సంక్రమించే వ్యాధులనే ఎస్టిడిలు లేదా ఎస్టిఐలు అంటారు. ఇవి చర్మంతోని చర్మాన్ని తాకడం, ఇంజెక్షన్లు లేదా సూదుల ద్వారా, రక్త మార్పిడి, తల్లి నుంచి నవజాత శిశువులకు వ్యాప్తి చెందుతాయి. వ్యాధి తీవ్రతను బట్టి.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో వంధ్యత్వం కూడా ఉంది. ఇది శారీరక సమస్యలతో పాటుగా జీవిత భాగస్వాముల మధ్య ఎన్నో సమస్యలను కలిగిస్తుంది.
అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులు వ్యాపించకుండా చూసుకోవచ్చు. లైంగిక సంబంధాన్ని పరిమితం చేయడం, లైంగిక సంపర్కం సమయంలో సేఫ్టీని ఉపయోగించడం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం, కొత్త సూదులనే ఉపయోగించడం వల్ల ఎస్టిడిలు, ఎస్టిఐలకు దూరంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు. అయినప్పటికీ ఎస్టిడిలు చర్మ సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఇక్కడ యోని ద్వారా సెక్స్ జరగదు.
ముద్దు నుంచి ఎస్టిడి వ్యాపిస్తుందా?
అవును.. ముద్దు ద్వారా కూడా లైంగికంగా సంక్రమించే వ్యాధులు వస్తాయి. అయినప్పటికీ ఇది యోని లేదా నోటి సంపర్కం నుంచి సంక్రమణ వచ్చే అవకాశం తక్కువ కంటే చాలా తక్కువ. చాలా ఎస్టిడిలు రక్తం మార్పిడి ద్వారా వ్యాప్తి చెందుతాయి. అయినప్పటికీ వీర్యం లేదా రక్తం కంటే లాలాజలం ద్వారా సంక్రమణ వ్యాప్తి తక్కువగా ఉంటుంది.
అయితే మీకు బయటకు కనిపించే గాయాలు లేదా పుండ్లు ఉంటే సంక్రమణ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ముద్దు ద్వారా సంక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముద్దు నుంచి సంక్రమించే అత్యంత సాధారణ ఎస్ టిడిలలో కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
హెర్పెస్
ముద్దు ద్వారా వ్యాప్తి చెందే అత్యంత సాధారణ ఎస్టీడీలలో హెర్పెస్ ఒకటి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ముద్దు లేదా చర్మం నుంచి చర్మానికి ఏదైనా ఇతర రూపాల ద్వారా వస్తుంది. నోటిలో లేదా పెదవులపై ఏవైనా పుండ్లు ఉంటే హెర్పెస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. హెర్పెస్ వల్ల వచ్చే బొబ్బలు, ద్రవంతో నిండిన పుండ్లను గుర్తించడం చాలా సులభం. హెర్పెస్ అంటువ్యాధి అయినప్పటికీ.. వీటికి చికిత్స చేయించుకోవచ్చు. వీటిని సకాలంలో గుర్తించి హాస్పటల్ కు వెళ్లడం మంచిది. ముఖ్యంగా ఏదైనా లైంగిక చర్యలో పాల్గొనడానికి ముందు ఈ సమస్యల గురించి మీ భాగస్వాములతో చర్చించండి. ముద్దు పెట్టుకునే ముందు ఆ వ్యక్తికి ఇలాంటి సమస్యలు ఉన్నాయో లేదో కనుక్కోండి.
సిఫిలిస్
సిఫిలిస్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. దీనిలో నోరు, పురీషనాళం లేదా జననేంద్రియాల చుట్టూ నొప్పిలేని పుండ్లు కనిపిస్తాయి. ఇవి దీనికి ప్రారంభ లక్షణాలు. ఈ గాయాలు ఉన్నప్పుడు ముద్దు పెడితే సంక్రమణకు దారితీస్తుంది. ఇది సాధారణం అయినప్పటికీ.. ముద్దు ద్వారా మీరు ఈ తీవ్రమైన ఎస్టీడీకి దారితీస్తుంది.
హెచ్ వీపీ
ముద్దుకు హెచ్ వీపీ కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఎన్నో అధ్యయనాలు ముద్దుతోకూడా హెచ్ వీపీ వ్యాపిస్తుందని వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ.. ఇన్ఫెక్షన్ ఉన్న భాగస్వామితో సన్నిహితంగా ఉన్నప్పుడు.. నోట్లో కనిపించే పుండ్లు ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. సంక్రమణను నివారించడానికి హెచ్ వీపీ వ్యాక్సిన్ల గురించి వైద్యుడితో మాట్లాడాలి.