MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పాలలో బాదం పప్పులు కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

పాలలో బాదం పప్పులు కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

బాదం పప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇక పాలలో అయితే కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు ఉంటయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 04 2023, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కొంతమంది బాదం పప్పులను పాలలో వేసుకుని తాగుతుంటారు. ఎందుకంటే పాలు టేస్టీగా ఉంటాయని. కానీ ఇలా ఈ రెండింటినీ మిక్స్ చేసి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు తెలుసా? నిజానికి  బాదం, పాలు వేర్వేరుగా వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
almond milk

almond milk

పాలలో క్యాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీర అవసరాలను తీర్చడానికి సహాయపడటమే కాకుండా.. చర్మ సమస్యలు వంటి ఇతర బాహ్య సమస్యలను కూడా పరిష్కరిస్తాయి. చలికాలంలో బాదం పప్పును పాలతో కలిపి తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

37

బాదంలో మెగ్నీషియం, విటమిన్ ఇ, డైటరీ ఫైబర్ వంటి విలువైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలలో మూడు లేదా నాలుగు బాదం పప్పులను వేసి తీసుకుంటే ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. రోజూ బాదం కలిపిన పాలను తాగడం వల్ల శరీరంలో విటమిన్ ఇ స్థాయి పెరుగుతుంది. ఇది మీ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

47

పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. బాదం పాలు తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి. ఒక కప్పు బాదం పాలలో 39 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఈ పాలు ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప పానీయం. బాదం పాలు బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
 

57

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుప్పెడు బాదం పప్పులను పాలలో వేసి తినడం లేదా బాదం పలుకులను కలిపిన పాలను తాగడం వల్ల జీర్ణశయాంతర ప్రేగు కదలికను నిర్వహించడానికి, మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో పోషకాల శోషణను పెంచుతుంది.
 

67

బాదంలో మెగ్నీషియం, విటమిన్ ఇ తో పాటుగా ఇతర పోషకాలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇకపోతే ఎముకలకు అవసరమైన కాల్షియంను పాలు అందిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాకుండడా వివిధ చర్మ సమస్యలు, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. మరి బాదం పాలను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

77

కావల్సిన పదార్థాలు

గుప్పెడు బాదం పప్పులు 
1 గ్లాసు పాలు
1 టేబుల్ స్పూన్ పంచదార

ఎలా తయారు చేయాలి

ముందుగా బాదం పప్పులను మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో పాలు, పంచదార వేసి కలపాలి. అంతే ఆరోగ్యకరమైన బాదం పాలు రెడీ అయినట్టే..

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Stone Earrings: తక్కువ బంగారంతో స్టోన్ చెవిపోగుల డిజైన్లు
Recommended image2
Head Lice: ఈ సింపుల్ చిట్కాలతో తలలో పేలు మాయం.. ఒక్కసారి ట్రై చేయండి!
Recommended image3
Hairstyles: పొడవాటి ముఖం ఉన్నవారికి నప్పే హెయిర్ స్టైల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved