- Home
- Life
- స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా ? ఈ టిప్స్ పాటించలేదో.. మీ కళ్లు పక్కాగా దెబ్బతింటయ్ జాగ్రత్త..
స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా ? ఈ టిప్స్ పాటించలేదో.. మీ కళ్లు పక్కాగా దెబ్బతింటయ్ జాగ్రత్త..
Health Care Tips: స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. అంతేకాదు కంటిచూపు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అలా కాకూడదంటే మీరు కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాల్సిందే.. అవేంటంటే..?

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smart phone) అత్యవసర వస్తువుగా మారిపోయింది. దీన్ని ఉపయోగించకుండా క్షణ కాలం కూడా ఉండని వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా యువత (Youth). అవసరానికి వాడటంలో తప్పు లేదు కానీ.. ఇదే వ్యసనంగా మారితేనే ఎన్నో సమస్యలు (Problems) చుట్టుకునే ప్రమాదం ఉంది.
smart-phone
దీనివల్ల మనిషికి మనిషికి మాటలు కరువవడమే కాదు.. ఎన్న అనారోగ్య సమస్యలు (Illness issues)కూడా వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్లు అలసటకు గురవుతాయి. అలాగే కంటి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
స్మార్ట్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ కళ్లను దెబ్బతీస్తుంది. అలాగే కంటి చూపును కూడా తగ్గిస్తుంది. అందులో గంటల తరబడి స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే వారికే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ నుంచి మీ కళ్లను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
స్మార్ట్ ఫోను ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు దానిని నిరంతరం చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్య మధ్యలో కళ్లను తరచుగా బ్లింక్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీ కండ్లు తేమగా ఉంటాయి.
యాంటీ గ్లేర్ స్క్రీన్ ను ఉపయోగించడం: చాలా స్మార్ట్ ఫోన్ లు యాంటీ గ్లేర్ స్క్రీన్ తో వస్తాయి. కానీ కొన్ని ఫోన్లకు మాత్రం ఇలా ఉండదు. దానిలో మీరు యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉపయోగించండి. ఇది మీ కళ్లకు హానికరమైన కాంతి నుంచి రక్షిస్తుంది.
స్క్రీన్ ను శుభ్రంగా ఉంచుకోండి: స్మార్ట్ ఫోన్ ఎప్పుడూ ఉపయోగించడం వల్ల దాని స్క్రీన్ మురికిగా మారుతుంది. ఇది కళ్లపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను శుభ్రంగా ఉంచుకుంటేనే కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.
కళ్లకు-మొబైల్ కు డిస్టెన్స్ ను మెయిన్ టైన్ చేయండి: స్మార్ట్ ఫోన్ కు కంటికి మధ్య సరైన దూరాన్ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. స్మార్ట్ ఫోన్ ను కళ్ల నుంచి కనీసం ఒక అడుగు దూరంలో ఉంచడానికి ప్రయత్నించండి.
నైట్ మోడ్ ఉపయోగించండి: బ్లూ లైట్ (Blue light) ఫిల్టర్.. మీ ఫోన్ నుంచి వచ్చే కాంతి మీ కళ్లతో పాటుగా.. మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయకుండా నిరోధిస్తుంది. అంటే ఇది కండ్ల ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుతుందన్న మాట. అందుకే రాత్రి పూట మీరు ఫోన్ ను ఉపయోగిస్తున్నట్టైతే నైట్ మోడ్ (Night mode)ను తప్పకుండా ఉపయోగించండి.