MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చలికాలంలో సన్ బాత్ చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..!

చలికాలంలో సన్ బాత్ చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..!

చలికాలంలో సన్ బాత్ చేయడం వల్ల కలిగే లాభాలు అన్నీ.. ఇన్నీ కాదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అందుకే చలికాలంలో తప్పకుండా సన్ బాత్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Dec 10 2022, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సూర్యరశ్మిలో కాసేపు పడుకోవడాన్ని లేదా కూర్చోవడాన్ని సన్ బాత్ అంటారు. నిజానికి చలికాలంలో సన్ బాత్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సన్ స్క్రీన్ లేకుండా కాసేపు ఎండలో గడిపితే తేడాను మీరే గమనిస్తారు. అలా అని సూర్యరశ్మి మరీ ఎక్కువ ఉన్నప్పుడు.. ఎండలో ఉంటే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి.  అయితే మన శరీరానికి తగినంత సూర్యరశ్మిలో గడపటం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది

అధిక రక్తపోటుతో బాధపడేవారికి సన్ బాత్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సన్ బాత్ చర్మం పై పొరలో ఉన్న నైట్రిక్ ఆక్సైడ్ ను ప్రేరేపించడానికి సహాయపడుతుంది. దీంతో రక్త ధమనులను విస్తరిస్తాయి. ఇది రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. దీంతో మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
 

39

నిద్రను మెరుగుపరుస్తుంది

మన శరీరం ఉత్పత్తి చేసే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రను ప్రోత్సహించడానికి  చాలా చాలా అవసరం. పలు పరిశోధనల ప్రకారం.. ఉదయాన్నే ఒక గంటపాటు సహజ కాంతిని పొందడం వల్ల మీ నిద్ర మెరుగుపడుతుంది. మెలటోనిన్ ను ఎప్పుడు ఉత్పత్తి చేయాలో మీ శరీరానికి సూచించడం ద్వారా.. సూర్యరశ్మి మీ సిర్కాడియన్ లయను నియంత్రిస్తుంది.
 

49

నిరాశను పోగొడుతుంది

ఎండలో కాసేపు గడిపిన తర్వాత నిరాశ, నిస్పృహ లక్షణాలు చాలా వరకు తగ్గాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎండ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. సెరోటోనిన్ అనే హార్మోన్ సూర్యరశ్మి ద్వారా విడుదల అవుతుంది. ఉదయం గంట సేపు ఎండలో గడిపితే మీరు ఎలాంటి నిరాశ లేకుండా ఉంటారు. అలాగే మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. 
 

59

విటమిన్ డి అందిస్తుంది

మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయాన్నేకాసేపు ఎండలో నిలబడితే చాలు. నిజానికి మనదేశంలో సూర్యరశ్మికి ఎలాంటి లోటు లేకున్నా.. విటమిన్ డి లోపంతో బాధపడేవారు మాత్రం చాలా మందే ఉన్నారు. ఈ విటమిన్ డి శరీరాన్ని ఫ్లూతో సహా  ఎన్నో అనారోగ్యాల సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి, ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలను ఉంచడానికి చాలా అవసరం. సూర్యరశ్మికి ప్రతిస్పందనగా మన శరీరం విటమిన్ డి ని ఉత్పత్తి చేస్తుంది.
 

69

క్యాన్సర్ ను నివారించవచ్చు

ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. సన్ బాత్  తో ఎన్నో రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని నివారించొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే విటమిన్ డి లేకపోవడం వల్ల  రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉది. మన చర్మం సూర్య రశ్మిలో ఉన్నప్పుడు విటమిన్ డి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల కొన్ని క్యాన్సర్లను నివారించబడతాయి. ఇందుకోసం చర్మంపై ఎటువంటి లోషన్ లేదా నూనె రాయకుండా ప్రతిరోజూ ఎండలో గడపడం చాలా ముఖ్యం.

79

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

అంటువ్యాధులు,  సోరియాసిస్ వంటి ఎన్నో స్వయం ప్రతిరక్షక వ్యాధులతో పోరాడటానికి సూర్యరశ్మి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ డి స్థాయిలను పెంచడానికి, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి,  ఎన్నో  వైరల్ వ్యాధులతో పోరాడటానికి ఉదయం ఎండలో 10 నుంచి 15 నిమిషాలు సన్ బాత్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

89
<p>Sunbath</p>

<p>Sunbath</p>

ఎముకలను బలంగా చేస్తుంది

విటమిన్ డి పొందడానికి గొప్ప, సరళమైన మార్గాలలో ఒకటి సూర్యరశ్మిలో నిలబడటం. సూర్యరశ్మిలో ఉండటం వల్ల మన శరీరాలు విటమిన్ డిని ఉత్పత్తి చేస్తాయి. మీకు ఫెయిర్ స్కిన్ ఉంటే ప్రతిరోజూ 15 నిమిషాలు ఎండలో ఉండండి. విటమిన్ డి కాల్షియంను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే పెళుసైన, సన్నని లేదా రూపవికృతి చెందిన ఎముకలను నివారిస్తుంది.
 

99

ఒత్తిడిని తగ్గిస్తుంది

ఎండ మెలటోనిన్ ను ఉత్పత్తిచేయడానికి మీ శరీరానికి సహాయపడుతుంది. ఇది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. మెలటోనిన్ ఒత్తిడి రియాక్టివిటీని గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pearl nose pins: ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం
Recommended image2
Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!
Recommended image3
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved