ఫైబర్ ఫుడ్స్ బరువునే కాదు.. మలబద్దకం, మధుమేహం వంటి ఎన్నో రోగాలను తగ్గిస్తాయి..
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింగే మలబద్దకం తగ్గడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అనారోగ్య జీవన శైలి కారణంగా నేడు ఎంతో మంది ఎన్నో రకాల రోగాలతో బాధపడుతున్నారు . అందులో ఒకటి మలబద్దకం. ఈ సమస్య చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. మలబద్దకం చిన్న సమస్యగా అనిపించినా.. ఇది ఎన్నో శారీరక సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా మలబద్దకం వల్ల అర్శమొలలు అయ్యే అవకాశం ఉంది. అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు మలబద్దకం సమస్యను వదిలించడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం ద్వారా చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు ఇందుకోసం రోజూ ౩౦ గ్రాముల ఫైబర్ ను తీసుకోండి. వేయించిన ఆహారాలు, చక్కెర, ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించండి. శరీరంలో ఉండే అదనపు కొవ్వును కరిగించడానికి ఫైబర్ ఫుడ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట మొత్తంలో ఫైబర్ ను తీసుకుంటే కొన్ని రోజుల్లోనే కిలోల్లో బరువు కోల్పోతారు.
ఫైబర్ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం 18 శాతం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం నుంచి తొందరగా బయటపడాలనుకునే వారు ఈ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తింటే మంచి ఫలితం ఉంటుంది. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తింటే కూడా ఆరోగ్యానికి మంచిది.
ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: క్రమం తప్పకుండా పీచుపదార్థాలు ఎక్కువగా తినే వారి గుండె ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. గుండె సమస్యలు రాకూడదంటే పీచు పదార్థాలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫైబర్ తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల ప్రమాదం తగ్గుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం 5% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఫైబర్ ఎంతో సహాయపడుతుంది.
ఫైబర్ తినడం వల్ల మరణ ప్రమాదం తగ్గుతుంది: ఒక అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల 17 నుంచి 19 శాతం మరణ ప్రమాదం తక్కువగా ఉంటుందని తేలింది. ఎలాంటి రోగాలు సోకకుండా ఆరోగ్యంగా బతకాలనుకునే వారు రెగ్యులర్ గా ఫైబర్ ఫుడ్ ను పుష్కలంగా తినాలి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఫైబర్ తినడం ద్వారా మలబద్దకం పోతుంది: మలబద్దకం సమస్య పెద్దవారినే కాదు చిన్న పిల్లలను సైతం వేదిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి ట్యాబ్లెట్లకు బదులుగా ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు. పైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తొందరగా వదిలిపోతుంది. ప్రతిరోజూ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా కడుపు సమస్యలు దూరమవుతాయి.
స్ట్రాబెర్రీలు, అవకాడోలు, అరటిపండ్లు, ఆపిల్స్, క్యారెట్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. బరువు తగ్గడానికి ప్రతిరోజూ పీచుపదార్థాలను తినాలి.