చలికాలంలో తేనెను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?
చలికాలంలో గొంతునొప్పి, శ్వాసకోశ సంక్రామ్యతలు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. టీ లేదా గోరు వెచ్చని నిమ్మకాయ నీటిలో కొద్దిగా తేనె కలిపి తాగితే ఈ సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు.

honey
తేనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. తేనెలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి తేనెను ఆయుర్వేదంలో.. ఇతర ఔషదాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తేనె మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే అంటువ్యాధులతో పోరాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Image: Getty Images
తేనెలో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. తేనే మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో తేనెను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు. అవేంటంటే..
honey
డయాబెటీస్ కు , వృద్ధాప్యానికి వ్యతిరేకంగా తేనె పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తేనెలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల (ROS) నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. ఇది శరీరంలో పేరుకుపోయి కణాలకు హాని కలిగిస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ కు దారితీస్తుంది. అలాగే అకాల వృద్ధాప్యం, గుండె జబ్బులు వంటి కొన్ని ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
చలికాలంలో చాలా మంది గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అయితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి తేనె ఒక అద్భుతమైన నివారణ. శీతాకాలంలో శ్వాసకోశ సంక్రామ్యతలు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తగ్గించడానికి టీ లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీటిలో తేనెను కలిపి తాగాలి.
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోపోలిస్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలు ఉన్నప్పటికీ.. తేనె ఇప్పటికీ చక్కెరతో సమానమైన ప్రభావాన్ని కలిగి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనెను ఇవ్వకూడదు. ఎందుకంటే దీని బోటులిజం వచ్చే అవకాశం ఉంది. ఇది అరుదైన వ్యాధి అయినప్పటికీ తీవ్రమైన అనారోగ్యం బారిన పడేస్తుంది. ఈ వ్యాధి శరీరంలోని నరాలకు హాని కలిగిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కండరాల పక్షవాతానికి కారణమవుతుంది.