MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • తొక్కే కదా అని తీసిపారేస్తే పొరపాటే.. దీన్ని తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..!

తొక్కే కదా అని తీసిపారేస్తే పొరపాటే.. దీన్ని తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..!

అరటి తొక్కను తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 01 2022, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రోజూ ఒక అరటిపండును తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్న ముచ్చట అందరికీ తెలిసిందే. ఈ పండు శరీరంలో ఉండే అదనపు కొవ్వును తగ్గించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అరటి పండ్లలో విటమిన్ బి6, విటమిన్ బి12, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మీకు తెలుసా.. అరటిపండ్లతో పాటుగా అరటి తొక్కలను కూడా తినేయొచ్చు. ఈ తొక్కలు చర్మ సంరక్షణకే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. అరటితొక్కను వెన్నతో కలిపి తింటే కంటి ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. అరటి తొక్కలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి..

26
banana peels

banana peels

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది

అరటి తొక్కలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అరటి తొక్కల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మలబద్దకాన్ని కూడా పోగొడుతుంది. 

36

అధిక రక్తపోటును తగ్గిస్తుంది

అధిక రక్తపోటు ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందుకే రక్తపోటును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే అరటి తొక్కలను తింటే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. అరటి తొక్కలో ఫైబర్ కంటెంట్ తో పాటుగా పొటాషియం కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. అరటి పండ్లను తొక్కతో సహా రోజూ తింటే అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. హైబీపీ పేషెంట్లు తొక్కను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచిది. 
 

46

ఎముకలు బలంగా ఉంటాయి

అరటి తొక్కలు ఎముకలను బలంగా చేయడానికి కూడా సహాయపడతాయి. అరటిపండ్లలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అందుకే రోజూ ఒక అరటిపండును పిల్లలకు తినిపించాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్లు అరటిపండును తొక్కతో సహా తినడం మంచిది. 
 

56

కళ్లు  ఆరోగ్యంగా ఉంటాయి

అరటి తొక్క కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపర్చడంతో పాటుగా కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

66

మెటిమలు తగ్గుతాయి

అరటి తొక్క మొటిమలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం అరటితొక్క లోపలి తెల్లని భాగాన్ని ముఖంపై నిమిషం పాటు రుద్దండి. 30 నిమిషాల తర్వాత నీటితో మీ ముఖాన్ని నీట్ గా కడుక్కోండి. తరచుగా ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటుగా చర్మం కాంతివంతంగా మారిపోతుంది. ఇలా కాకుండా ఓట్స్, అరటి తొక్కలతో ప్యాక్ తయారు చేసుకుని కూడా ముఖానికి అప్లై చేయొచ్చు. ఇందుకోసం ఒకటిన్నర కప్పుల ఓట్స్ ని తీసుకోండి. ఒక అరటిపండు తొక్కను పేస్ట్ చేసి దానిలో.. ఓట్స్, చక్కెరను మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Salt Water Bath: నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే ఇన్ని లాభాలా? అయితే చేయాల్సిందే
Recommended image2
Eggplant: కొంచెం స్థలంలోనే వంగ మొక్కల్ని ఇలా పెంచండి
Recommended image3
Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved