చౌకైన బేకింగ్ సోడాతో.. ఆశ్చర్యపోయే ఆరోగ్య ప్రయోజనాలు..
benefits baking soda: బేకింగ్ సోడా చాలా చౌకైనదే అయినా.. దీనిని ఎన్నో సమస్యలకు నివారణగా ఉపయోగించుకోవచ్చు. కానీ చాలా మంది బేకింగ్ సోడాను ఒక వంట పదార్థం లాగే చూస్తున్నారు. కానీ బేకింగ్ సోడా మనకు దివ్య ఔషదమే చెప్పాలి. ఎలా అంటే..

బేకింగ్ సోడాను మనం విరివిగానే ఉపయోగిస్తాం. కానీ దీనిలో మనకు తెలియని ఆశ్చర్యకరమైన ఆరోగ్యకరమైన హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి. ఈ బేకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు. ఇది ఎన్నో వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వడదెబ్బకు చికిత్స గా కూడా దీన్ని వాడుతారు. అలాగే ఇంటిని క్లీన్ చేయడానికి కూడా ఇది అద్బుతంగా ఉపయోగపడుతుంది.
ఈ బేకింగ్ సోడాలో యాంటీ సెప్టిక్ మరియు ఆల్కలైన్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎన్నో సమస్యలకు నివారణగా ఉపయోగపడతాయి. ఇది అంత ఖరీదైనది కూడా కాదు. మార్కెట్ లో చాలా చౌకగా లభిస్తుంది. అలాగే ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. మరి ఇది ఎలా మనకు ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
టూత్ పేస్ట్ గా ఉపయోగించవచ్చు.. దంతాలను తల తల మెరిపించడంలో బేకింగ్ సోడా ముందుంటుంది. ఇది నోట్లో ఉండే మైక్రోబ్యాక్టీరియాను కూడా అంతం చేయగలదు. దంతాలు తెల్లగా మారాలంటే కొబ్బరి నూనె, పిప్పరమెంటు నూనె, బేకింగ్ సోడాను నీటితో కలిపి బ్రష్ చేయాలి. అయితే ఈ పద్దతిని తరచుగా మాత్రం ఫాలో కాకూడదు. ఎందుకంటే ఈ పద్దతిని ఎక్కువ సార్లు ఉపయోగిస్తే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది.
ఆయిల్ రిమూవర్.. బేకింగ్ సోడా శుభ్రపరిచే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆయిల్ రిమూవర్ గా ఎంతో సహాయపడుతుంది. తివాచీలు లేదా బట్టలపై ఎక్కడైనా ఆయిల్ మరకలు అయితే.. దాన్ని తొలగించేందుకు వాటర్ లో కొంచెం బేకింగ్ సోడాలను వేసి నానబెడితే ఈజీగా మరకలు తొలగిపోతాయి.
పాదాలు.. మురికి, చెమట, సూర్యరశ్మి కారణంగా పాదాలు జిడ్డుగా తయారవుతాయి. అంతేకాదు వీటివల్ల పాదాల నుంచి దుర్వాసన కూడా రావొచ్చు. ఈ సమస్యను తొలగించేందుకు బేకింగ్ సోడా సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్లలో బేకింగ్ సోడాను వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టండి.
అలసటను తగ్గిస్తుంది... రన్నింగ్, వర్కౌట్స్, జాగింగ్ చేసే సమయంలో ఒంట్లో లాక్టిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల మీరు అలసిపోతారు. అలాంటి సమయంలో కాస్త బేకింగ్ సోడా వాటర్ ను తీసుకుంటే అలసట మటుమాయం అవుతుంది.
కిడ్నీ స్టోన్స్ ఏర్పకుండా చేస్తుంది.. కిడ్నీ స్టోన్స్ సమస్య ప్రస్తుత కాలంలో ఎక్కువైంది. దీనికంతటికి కారణం కీడ్నీలో ఆసిడిక్ లెవెల్స్ పెరగడమే. అయితే బేకింగ్ సోడా వాటర్ తాగితే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలను నివారిస్తుంది.. జీర్ణసమస్యలతో బాధపడుతున్న వారికి బేకింగ్ సోడా దివ్య ఔషదమనే చెప్పొచ్చు. హార్ట్ బర్న్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.