MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • ఈ సమస్యలుంటే వాము నీళ్లను ఖచ్చితంగా తాగండి.. అన్నీ నయమవుతాయి..

ఈ సమస్యలుంటే వాము నీళ్లను ఖచ్చితంగా తాగండి.. అన్నీ నయమవుతాయి..

బరువును తగ్గించడం నుంచి.. ఒంట్లో కొలెస్ట్రాల్ ను కరిగించడం వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి వాము నీళ్లు. అందుకే ప్రతిరోజూ వాము నీళ్లను ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 20 2022, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఏం చేసినా.. బరువు పెరగడమే కానీ తగ్గడమేనేదే లేకుండా పోయింది. ఇక కొంతమంది అయితే శక్తికి మించి జిమ్ముల్లో చెమటోడుస్తుంటారు. అయినా అరకిలో కూడా బరువు తగ్గరు. నిజానికి రోజూ వ్యాయామం చేస్తూ.. కొన్ని ఆహారాలను, హెల్తీ పానీయాలను తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు. అందులో వాము నీళ్లు అయితే బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పని చేస్తాయంటున్నారు నిపుణులు. మీ శరీరంలో కొవ్వు ఎక్కువైందా..? అయితే ప్రతిరోజూ వాము నీళ్లను తప్పకుండా తాగండని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఈ అజ్వైన్ వాటర్ వల్ల ఇంకా ఏమేం ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి.. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మంచి జీర్ణక్రియ

ప్రతిరోజూ వాము నీళ్లను తాగడం వల్ల అజీర్థి సమస్య తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయం పరిగడుపున ఈ నీటిని తాగండి. మెరుగైన జీర్ణక్రియ బరువు బరువు  హెచ్చుతగ్గులను పరిమితం చేస్తుంది. అంటే ఇది పరోక్షంగా మీరు బరువు  తగ్గడానికి సహాయపడుతుందన్న మాట. వాము నీళ్లను తాగడం వల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. పేగు కదలికలు మెరుగుపడతాయి. 
 

36

ఉబ్బరాన్ని తగ్గిస్తుంది

కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం, పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే అజ్వైన్ నీటిని తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ మీ గట్ లోని ఎంజైమ్లు సక్రమంగా ఉండేట్టు చూస్తుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని తాగడం వల్ల పొత్తికడుపు తిమ్మిరి కూడా తగ్గుతుంది. 

46

కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది

వాము మన శరీరంలో పోషకాలు పూర్తిగా శోషించుకోవడానికి సహాయపడుతుంది. దీంతో కొవ్వు పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. ఇది బరువు తగ్గేందుకు కూడా దోహదపడుతుంది. దీనిలో ఉండే నూననె థైమోల్ జీవక్రియను పెంచేందుకు సహాయపడుతుంది. జీవక్రియ మెరుగ్గా ఉంటే బరువు తగ్గడం సులువు అవుతుంది. 
 

56

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

ఒబేసిటీకి ప్రధాన కారణం కొలెస్ట్రాల్. అయితే ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించే ఎన్నో ఔషద గుణాలు వాములో ఉంటాయి. వాము చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను ఇట్టే తగ్గిస్తుంది. దీంతో మీరు ఊబకాయం నుంచి తొందరగా బయటపడతారు. అజ్వైన్ నీళ్లు ఒక్క బరువును తగ్గించడమే కాదు.. స్ట్రోక్, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఇతర వ్యాధుల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. 
 

66

గర్భాధారణ తర్వాత బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ప్రెగ్నెన్సీ టైం లో చాలా మంది ఆడవారు విపరీతంగా బరువు పెరుగుతారు. డెలివరీ తర్వాత బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇలాంటి వాళ్లకు వాము నీళ్లు బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. అజ్వైన్ విరేచనాలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భంతో ఉన్నప్పుడు వచ్చిన కొవ్వును తగ్గించడానికి వాము ఎంతో సహాయపడుతుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Lunch Box Recipes: నిమిషాల్లో తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీలు.. టేస్ట్ అదుర్స్!
Recommended image2
Sarees: ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో
Recommended image3
Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు నల్లపూసలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved