MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Yelling at Children: పిల్లలు తప్పు చేస్తున్నారని అరుస్తున్నారా? ఈ ఒక్క పని చేస్తే చాలు

Yelling at Children: పిల్లలు తప్పు చేస్తున్నారని అరుస్తున్నారా? ఈ ఒక్క పని చేస్తే చాలు

 Yelling at Children: పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులకు కోపం రావడం సహజం. వెంటనే పిల్లల మీద కోపంతో అరిచేస్తారు. కానీ, అలా అరవకుండా పిల్లలను మార్చుకోవచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 23 2026, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Parenting tips
Image Credit : Freepik

Parenting tips

పిల్లలు అల్లరి చేయడం సహజం. తెలిసీ, తెలియకుండా పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు.ఇంట్లో ఏదైనా వస్తువు పగిలిపోయినా, పిల్లలు చదువును నిర్లక్ష్యం చేసినా.. తల్లిదండ్రులకు వెంటనే కోపం వచ్చేస్తుంది. వెంటనే పిల్లల మీద అరిచేయడం, తిట్టేయడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.

కానీ, కోపం చూపించడం వల్ల పిల్లలు తాము చేసిన తప్పును అర్థం చేసుకోలేరు. అందుకే.. వారిపై కోప్పడటం, తిట్టడం కంటే.. వారిలో మార్పు తీసుకురావడం చాలా ముఖ్యం. మీరు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే.. ఇంకోసారి వారు తప్పు చేయకుండా ఉండాలి అంటే.. వారితో తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. మరీ ముఖ్యంగా మూడు ప్రశ్నలు అడగాలని.. ఆ ప్రశ్నల సమాధానాలే పిల్లల్లో మార్పులు తీసుకువస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి.. పిల్లలను ఎలాంటి ప్రశ్నలు అడగాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  పిల్లలపై అరవడం పరిష్కారం కాదు...
Image Credit : chatgpt

పిల్లలపై అరవడం పరిష్కారం కాదు...

పిల్లలపై అరవడం సమస్యకు పరిష్కారం కాదు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలపై అరవడం వల్ల వారి మనసు దెబ్బ తింటుంది. అంతేకాదు.. మనం అరవడం వల్ల వారు మరింత మొండిగా తయారవ్వడం, మన దగ్గర నిజాలు దాచి అబద్దాలు చెప్పడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తారు. అంతేకాకుండా.. వారు చేసిన తప్పు ఏంటి అనే విషయం కూడా వారికి సరిగా అర్థం కాదు. తాము చెడ్డవాళ్లం అనే భావన పిల్లల్లో పెరుగుతుంది. వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.

33
  పిల్లల్లో మార్పు తెచ్చే ప్రశ్నలు...
Image Credit : Gemini AI

పిల్లల్లో మార్పు తెచ్చే ప్రశ్నలు...

1.ఏం జరిగింది..?

మీ పిల్లలు ఏదైనా తప్పు చేశారు అని మీకు అనిపిస్తే.. వెంటనే వారిని కూర్చోపెట్టుకొని అసలు ఏం జరిగింది అనే విషయం అడగాలి. వాళ్లు చెబుతున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడకూడదు. పూర్తిగా వారు చెప్పేది వినాలి. అప్పుడు పిల్లలు నిజం చెప్పడానికి ముందుకు వస్తారు.

2.జరిగిన తప్పును ఎలా సరిదిద్దుదాం..?

తప్పు జరిగిపోయింది. కాబట్టి.. తర్వాత ఏం చేయాలి అనే విషయం చాలా కీలకం. కాబట్టి.. చేసిన తప్పును ఎలా సరిదిద్దాలి అనే విషయం గురించి పిల్లలు ఆలోచించేలా చేయాలి. సారీ చెప్పడం, కింద పడిన దానిని తీయడం.. ఇలా ఏదో ఒక పరిష్కారం వారి నుంచే చెప్పించాలి.

3.మరోసారి తప్పు జరగకూడదంటే ఏం చేయాలి?

ఈ ప్రశ్న అడగడం వల్ల.. మీ పిల్లలు మరోసారి తప్పు చేయడానికి ఆలోచిస్తారు. ఇది వారి తప్పుల నుండి నేర్చుకోవడానికి సహాయపడుతుంది.

ఇది పిల్లల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

మీ పిల్లలు పరిష్కారాలను స్వయంగా ఆలోచించినప్పుడు, వారిలో జవాబుదారీతనం లేదా బాధ్యత పెరుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
చిన్నారుల సంరక్షణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sprouted Green Gram: 30 రోజులపాటు మొలకెత్తిన పెసలు తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Stubborn Pimples: 7 డేస్ ఛాలెంజ్..జీవితంలో మొటిమలు, యాక్నే రాదు.
Recommended image3
Rice Cooking: కుక్కర్‌లో వండిన అన్నం మంచిదా? లేక వార్చి వండినది ఆరోగ్యకరమా?
Related Stories
Recommended image1
Jasmine Flowers: ఇలా చేస్తే మల్లెపూలు 15రోజులైనా తాజాగా, ఫ్రెష్ గా ఉంటాయి
Recommended image2
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved