BeautyTips: చుండ్రు తో బాధపడుతున్నారా.. అయితే ఈ విటమిన్ లు లోపమేమో, జాగ్రత్త పడండి!
Beauty Tips: ఆడవాళ్ళు జుట్టుకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది అందరికీ తెలిసిందే.అయితే అంతటి అందమైన జుత్తు చుండ్రు కారణంగా ఊడిపోతుంటే ఆ బాధ వర్ణనాతీతం. అందుకే చుండ్రు రావడానికి గల కారణాలు దాని నివారణ మార్గాలు తెలుసుకుందాం.
తల దువ్వుకునేటప్పుడు జుట్టు రాలిపోతూ ఉంటే, లేదంటే దువ్వెన నిండా జుట్టు కనిపిస్తూ ఉంటే ఆడవాళ్ళ బాధ వర్ణనాతీతం. జుట్టు ఊడిపోతుంది అని చాలామంది రకరకాల చికిత్సలు, వివిధ రకాల హెయిర్ మాస్కులు వాడుతూ ఉంటారు. అయితే వీటన్నిటికన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు ఈ హెయిర్ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అని.
అవునండి హెయిర్ ఫాల్ కి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఒత్తిడి వల్ల హెయిర్ ఫాల్ కలుగుతుంది. అలాగే విటమిన్ లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ కలుగుతుంది. అలాగే కాలుష్యం వల్ల, చుండ్రు వల్ల కూడా హెయిర్ ఫాల్ కలుగుతుంది.
ఆరోగ్యకరమైన జుట్టుని కాపాడుకోవడంలో విటమిన్లు మరియు ఖనిజాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అలాగే మీ శరీరంలో తగినంత బి12 విటమిన్ లేనప్పుడు జుట్టు సమర్థవంతంగా పెరగదు.
అంతేకాకుండా జుట్టు రాలిపోవడానికి కూడా కారణం అవుతుంది. అలాగే విటమిన్ ఏ, ఈ, సి వంటి విటమిన్ లోపాలు కూడా జుట్టు రాలడానికి దోహదం చేస్తాయి. అలాగే చుండ్రు కూడా జుట్టు రాలటానికి దోహదం చేస్తుంది.
చుండ్రు కూడా కొన్ని విటమిన్ ల లోపం కారణంగా వస్తుంది అయితే అది తక్కువ శాతం మాత్రమే. అధికంగా మాత్రం ఒత్తిడి వలనఅలాగే తలపై చాలా నూనె ఫలితంగా చర్మ కణాలు పేరుకుపోయి ఆ తర్వాత అట్టలు కట్టినట్లుగా అయిపోతుంది.
అలాగే ఎక్కువగా షాంపు చేయటం మరియు ఎక్కువగా ఆరబెట్టడం వంటివి చేసినా కూడా చుండ్రు ఎక్కువగా వస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని కావలసిన విటమిన్లు జుట్టుకి అందేలాగా చూసుకోవాలి. అలాగే సరైన పోషకాహారం తీసుకోవడం కూడా చుండ్రు తగ్గడానికి జుట్టు పెరగడానికి ఎంతో అవసరం.