Hair Growth Tips: జుట్టు పొడుగ్గా పెరగాలంటే ఇలా చేయండి..
Hair Growth Tips: జుట్టును ఆరోగ్యంగా పొడుగ్గా పెంచడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే..

పొడవైన, అందంగా మెరిసే జుట్టంటే ఎవరికి ఇష్టముండదూ.. కానీ ఈ రోజుల్లో హెయిర్ పాల్ సమస్యలు బాగా పెరిగిపోతాయి. పొడవైన, ఒత్తైన జుట్టు ఉండటం గగనమైపోయింది. చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు లేదా కొన్ని ఇతర ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టుకు సరైన పోషణ అందినప్పుడే ఆరోగ్యంగా, పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది. అందులో కొన్ని రకాల ఆహార పదార్థాలు జుట్టుకు మ్యాజిక్ లాగా పనిచేస్తాయి. అవి జుట్టును ఆరోగ్యంగా పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మెంతులు (Fenugreek)
జుట్టు పెరుగుదలకు ఇనుము, ప్రోటీన్ రెండు ముఖ్యమైన పోషకాలు చాలా అవసరం. ఇవి మెంతుల్లో పుష్కలంగా ఉంటాయి. మెంతుల్లో ఫ్లేవనాయిడ్లు, సపోనిన్లు ఉంటాయి. ఈ సమ్మేళనాలు వాటి శోథ నిరోధక (Anti-inflammatory), యాంటీ ఫంగల్ (Antifungal)గుణాలతో జుట్టు పెరుగుదలకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
కరివేపాకు ఆకులు (Curry leaves)
కరివేపాకు ఆకులు జుట్టుకు అద్భుతంగా పనిచేస్తాయి. కరివేపాకు ఆకులు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అలాగే యాంటీ ఫంగల్ (Antifungal), యాంటీ బాక్టీరియల్ (Antibacterial), యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి చుండ్రు, చిన్న స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను వదిలించుకోవడానికి సహాయపడతాయి అలాగే జుట్టు పెరుగుదలను పెంచుతాయి.
అవిసె గింజలు (Flax seeds)
వీటిలో కొవ్వు ఆమ్లాలు (Fatty acids), యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నెత్తిమీద నుంచి కాలుష్య కారకాలను , చనిపోయిన కణాలను తొలగిస్తాయి. అలాగే అవిసె గింజల జెల్ ను జుట్టు ఎదుగుదలను ప్రోత్సహించడానికి, జుట్టు నాణ్యతను పెంచడానికి జుట్టుకుు మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. అవిసె గింజల జెల్ సూపర్ హైడ్రేటింగ్, కండిషనింగ్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. జెల్ కూడా జుట్టును మెత్తగా చేస్తుంది.
కలబంద (Aloe vera)
కలబందలో విటమిన్లు ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లన్నీ ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ప్రోత్సహించడానికి, జుట్టు మెరిసేలా చేయడానికి ఎంతో సహాయపడతాయి. కలబంద జెల్ లో విటమిన్ బి 12 , ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఈ రెండూ మీ జుట్టు రాలిపోకుండా నిరోధించగలవు.
అల్లం (Ginger)
ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో అల్లం ఒకటి. ఇది జింజెరోల్, జింగెరాన్, షోగాల్, బీటా బిసాబోలిన్ తో సహా అనేక క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటుంది. ఇది మనల్ని వేడిగా ఉంచుతుంది. అలాగే జలుబు, దగ్గు నుంచి మనల్ని రక్షిస్తుంది. చుండ్రు, దురద వంటి సమస్యలను తొలగిస్తుంది. దానిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ లక్షణాల కారణంగా.. అల్లం చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మొత్తం మీద ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. సన్నని జుట్టును కలిగి ఉన్నవారుకి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. అల్లం జుట్టును నిగనిగలాడేలా, మృదువుగా తయారుచేస్తుంది.