Hair Fall Risk: వీటిని తింటే పెళ్లికి ముందే బట్టతల వస్తది జాగ్రత్త..
Hair Fall Risk: యుక్త వయసులో జుట్టు ఊడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఎంత తొందరగా వదిలేస్తే మీ జుట్టు అంత సేఫ్ గా ఉంటుంది. లేదంటే బట్టతల పక్కాగా వస్తుంది.

ఒకప్పుడు బట్టతల (Bald) వృద్ధాప్యానికి చిహ్నంగా ఉండేది. ఇప్పుడు రోజులు మారినయ్. 25 ఏండ్ల నుంచి 30 ఏండ్ల యువకులు కూడా హెయిర్ ఫాల్ సమస్య, బట్టతల బారిన పడుతున్నారు. ఎంతో మంది అబ్బాయిలు పెళ్లికి ముందే బట్టతల బారిన పడుతున్నారు. దీనివల్ల చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
Baldness
అయితే ఈ బట్టతల కొంతమందికి జన్యుపరమైన (Genetic)కారణాల వస్తే.. మరికొంతమందికి మాత్రం వల్ల వస్తుంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలను తింటే బట్టతల వస్తుంది. అవేంటో తెలుసుకుందాం పదండి..
చక్కెర (Sugar)
షుగర్ ను మధుమేహులు చాలా తక్కువ మొత్తంలోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే చక్కెర వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. అంతేకాదు షుగర్ ను ఎవరు ఎక్కువగా తీసుకున్నా.. జుట్టు త్వరగా రాలడం మొదలువుతుంది. అందుకే స్వీట్ ఐటమ్స్ ను తినడం తగ్గించండి. వీటికి బదులుగా పండ్లను ఎక్కువ మొత్తంలో తినండి.
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ (Fast food)
ప్రస్తుతం నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ సెంటర్లు ఎక్కడ చూసిన దర్శనమిస్తున్నాయి. చాలా మంది ఇంట్లో వండిన ఆహారపదార్థాలకు బదులుగా వీటిని తినడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ ఈ ఆహారాలను తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా వీటిలో సంతృప్త కొవ్వు (Saturated fat)ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జుట్టును ఊడిపోయేలా చేయడమే కాదు.. బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఈ జంక్ ఫుడ్ లో ఉండే డిహెచ్ టీ అనబడే ఆండ్రోజెన్ బట్టతలకు దారితీస్తుంది. అంతేకాదు ఈ ఆహారాలు మాడును మృదువుగా చేస్తుంది. దీంతో వెంట్రుకల ఫోలికల్స్ రంద్రాలు మూసుకుపోతాయి. ఇది జుట్టును పెరుగుదలను నిలిపివేస్తుంది.
కలుషితమైన చేపలు (Contaminated fish)
చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపలను తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అందుతాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. మార్కెట్ లో మంచి చేపలతో పాటుగా కలుషితమైన చేపలు కూడా ఉంటాయి. వీటిని తింటే జుట్టు దారుణంగా ఊడిపోతుంది. ఎందుకంటే ఈ చేపల్లో ఉండే పాదరసం హెయిర్ ఫాల్ కు కారణమవుతుంది. అందుకే చేపలను చూసి కొనండి.
మద్యపానం (Alcohol)
యువత, మధ్యవయస్కులు, పెద్దవారంటూ తేడా లేకుండా మద్యాపానానికి బానిస అయినవారు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. ఆల్కహాల్ ను విపరీతంగా తాగేవారు తొందరగా ముసలివాళ్లు అవడమే కాదు.. బట్టతల కూడా తొందరగానే వస్తుంది. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల ప్రోటీన్ సంశ్లేషణపై చెడు ప్రభావం పడుతుంది. దీంతో జుట్ఠు బలహీనపడి.. చివరకు ఊడిపోతుంది.
గుడ్డు (egg)
గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ముఖ్యంగా గుడ్డులోని ప్రోటీన్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా.. జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. గుడ్డులోని ప్రోటీన్లు జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. అయితే గుడ్డును పచ్చిగా మాత్రం తినకూడదు. అలా తింటే బయోటిన్ లోపం ఏర్పడుతుంది. కెరోటిన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. వీటివల్ల జుట్టు తెల్లబడటంతో పాటుగా జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది.